NTV Telugu Site icon

Virat Kohili – Rinku Singh: మ్యాచ్ లోనే రింకూను ర్యాగింగ్ చేసిన కోహ్లీ..!

133

133

విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికే రారాజుగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఏ రికార్డు చూసిన కోహ్లీ పేరు కచ్చితంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ క్రికెట్ గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే ఫన్నీగా ఉంటాడు. తాను ఉండడమే కాకుండా పక్కవారిని కూడా నవ్విస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. నిజానికి విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కోహ్లీ తన తోటి ఆటగాడిని సరదాగా ర్యాగింగ్ చేశాడు. శుక్రవారంనాడు జరిగిన మ్యాచ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సరదాగా ఓ విషయం చోటుచేసుకుంది.

Also read: Viral Video: ఈ పెద్దాయన ఈ ఏజ్ లోనే ఇలా ఉన్నాడంటే.. ఇక ఆ రోజుల్లో.. టిల్లు స్క్వేర్ సినిమా చూస్తూ..?!

టీమిండియాలో ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటర్ రింకు సింగ్ ఇద్దరు ఓకే టీం ఆడుతుండగా.. ఐపీఎల్ లో మాత్రం ప్రత్యర్థులుగా తలబడ్డారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉండగా సునీల్ నరేన్ బోలింగ్ వేశాడు. అయితే సునీల్ నరేన్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ మిడ్ ఆఫ్ మీదుగా కొట్టగా అందరూ ఒక్క రన్ అని మాత్రమే అనుకున్నారు. కాకపోతే ప్రపంచంలో వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరిగెత్తే వారిలో విరాట్ కోహ్లీ కూడా ఒకడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్క పరుగును కూడా డబుల్స్ గా మార్చడంలో విరాట్ కోహ్లీ దిట్ట. అయితే విరాట్ కోహ్లీ కొట్టిన షాట్ ను కేకేఆర్ ఫీల్డర్ రింకు సింగ్ పట్టుకొని మెరుపు వేగంతో బాల్ ను వికెట్ కీపర్ కు విసిరేశాడు.

Also read: Bartharathna LK Advani: అద్వానీ ఇంటికి వెళ్లి ‘భారత రత్న’ను అందచేసిన ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ..!

అలా బాల్ తీసుకున్న వికెట్ కీపర్ మెరుగు వేగంతో రన్ అవుట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బాల్ వికెట్ కీపర్ స్టెమ్పింగ్ చేయకముందే విరాట్ కోహ్లీ రెండు పరుగులను పూర్తి చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అయితే ఈ సమయంలో రన్ అవుట్ మిస్ అవ్వడంతో రింకు సింగ్ నిరాశతో ఉండగా.. సింగిల్ రావలసిన చోట డబ్బులు వచ్చిందన్న జోష్ లో విరాట్ కోహ్లీ రింగు సింగును ర్యాగింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ రింకు వైపు చూస్తూ.. తాను ఏదో సాధించినట్లు పంచులు వేశాడు. అంతేకాదు ఓ డ్యాన్స్ స్టెప్పు కూడా వేసి అందరిని నవ్వించాడు విరాట్ కోహ్లీ. రన్ అవుట్ మిస్ అయిన బాధలో ఉన్న రింకూ.. కోహ్లీ రియాక్షన్ చూసి నవ్వుకున్నాడు కూడా. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఒకసారి చూడండి.