NTV Telugu Site icon

Viral Video Today: పొరపాటున ఫస్ట్ గేర్‌.. జలపాతంలో పడిపోయిన కారు! వీడియో వైరల్

Car Falls

Car Falls

Car Falls In Waterfall at Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సమీపంలోని లోహియా కుంద్‌ జలపాతం వద్ద ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. జలపాతం అంచన పార్క్ చేసిన కారు ఒక్కసారిగా కిందికి పడిపోయింది. కారులో ఉన్న చిన్న పాప భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్‌లో కుంద్‌ జలపాతం ఉంది. ఈ జలపాతంను చూసేందుకు గత కొద్ది రోజులుగా భారీగా జనాలు వస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం ఓ కుటుంబం అక్కడికి విహార యాత్రకు వచ్చింది. కారుని జలపాతం అంచున పార్క్ చేశారు. కొద్దిసేపటి తర్వాత కారు అకస్మాత్తుగా జలపాతం వైపు జారిపోయింది. అందరూ చూస్తుండగానే.. జలపాతంలోకి పడిపోయింది. కారు పడే సమయంలో డోర్ ఊడిపోయింది. దాంతో భర్త నీటిలో పడగా.. అతడి భార్య, కూతురు లోపలే చిక్కుకున్నారు.

Also Read: Itchy Eyes Home Remedies: కళ్ల దురదతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ హోం రెమెడీస్‌తో ఇట్టే చెక్ పెట్టండి!

కారులో ఉన్న చిన్న పాప భయంతో కేకలు వేసింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి జలపాతంలోకి దూకి భర్తను కాపాడాడు. ఇంకొందరు భార్య, కూతురును కాపాడారు. ఆపై వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రవర్స్ గేర్‌ బదులుగా.. పొరపాటున ఫస్ట్ గేర్‌ వేయడంతో కారు జలపాతంలో పడిపోయిందని సమాచారం తెలుస్తోంది. కారు జలపాతంలో పడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అప్పుడూ కూడా అంచుల వద్ద పార్క్ చేయకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Show comments