NTV Telugu Site icon

Viral Video: టీచరమ్మ నువ్వు గ్రేట్… ప్రతి ఆడపిల్ల చూడాల్సిన వీడియో!

Good Touch

Good Touch

మహిళల పట్ల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు చేసినా, శిక్షలు విధిస్తున్నా మృగాళ్లు మారడం లేదు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను సైతం తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. వారి ప్రాణాలు సైతం తీస్తున్న సందర్భాలు అనేకం. తెలిసి తెలియని వయసులో చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపగానే వారితో వెళ్తూ ఉంటారు పసివాళ్లు. దానిని ఆసరాగా తీసుకొని వారిపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిండం మంచిది. ఇదే విషయాన్ని నిపుణులు కూడా పలు వేదికలపై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ టీచరమ్మ చేస్తున్న ప్రయత్నం అందరిని ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో టీచర్ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో ప్రాక్టికల్ గా చేసి చూపెడుతోంది. ఎలా పట్టుకుంటే గుడ్ టచ్, ఎలా పట్టుకుంటే బ్యాడ్ టచ్ అని విద్యార్థినులకు అర్థం అయ్యేలా చెబుతుంది. వారిని స్వయంగా తానే టచ్ చేస్తూ బ్యాడ్ టచ్ అనిపిస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నేర్పిస్తుంది. ఎలా కోపాన్ని చూపాలి. ఎలా మాట్లాడాలి. ఆ సందర్భం నుంచి ఎలా బయటపడాలో కూడా పిల్లలకు నేర్పిస్తోంది. అంతేకాకుండా వారికి ఏం అర్ధం అయ్యిందో కూడా తరువాత అడిగి తెలుసుకుంటోంది.

Also Read: Jasleen Royal: నా కల అంత ఈజీగా నెరవేరలేదు… వెనక్కి వెళ్లిపోదాం అనుకున్నా
ఈ వీడియోను రోషన్ రాయ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘టీచర్ వైరల్ కావడానికి అర్హురాలు. దేశంలోని ప్రతి పాఠశాలలోనూ ఈ వీడియో చూపించాలి’అని రాసుకొచ్చాడు. ఈ వీడయో చూసిన నెటిజన్లు ఆ టీచర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పిల్లలపై అఘాయిత్యాలు అరికట్టాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలాంటి విషయాలు చిన్నారులకు నేర్పించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments