Viral Video: దేశంలో ప్రతిరోజు అనేకచోట్ల ప్రజల వద్ద నుంచి అక్రమంగా లేదా సరైన లెక్కలు లేని ధనాన్ని పోలీసులు చెకింగ్ సమయంలో సీజ్ చేయడం చూసే ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా ఎన్నికల సమయంలో కనబడుతుంటాయి. ప్రతిరోజు అనేకమంది వారికి వ్యాపారాల నిమిత్తం లేదా వేరే అవసరాలకైనా పెద్ద మొత్తంలో కొందరు డబ్బులను ఒకచోటి నుంచి మరొక చోటికి తరలిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లేదా బిల్లులను చూపిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా లేనియెడల ఆ డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడు-కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లో చోటు చేసుకుంది.
ఎప్పటిలాగే పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అటుపై బైకులో వెళ్తుండగా.. పోలీసులను చూసి అతడు సడన్ గా బ్రేక్ వేసి వెంటనే యూటర్న్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అనుమానం వచ్చి అతన్ని వెంటాడి పట్టుకున్నారు. అతడిని పోలీసులు ఎక్కడికి పోతున్నావని ప్రశ్నించగా.. అతడు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అతడిపై అనుమానం వచ్చింది. ఇంకేముంది అతడి వద్ద ఉన్న బైకులు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా సీటుపై చేయి వేయగానే ఏదో కాస్త తేడా శబ్దం రావడంతో పోలీసులు బైక్ సీటును ఓపెన్ చేశారు. ఇంకేముంది ఒక్కసారిగా పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.
ఆ బైకు సీటులో ఏకంగా లక్షల కొద్ది నోట్లో కట్టలు దర్శనమిచ్చాయి. అంతేకాదు ఆ బైక్ పెట్రోల్ ట్యాంకు ఉన్న చోట కూడా ఓ చిన్న రంధ్రంలో పెద్ద ఎత్తున 500 రూపాయల నోట్ల కట్టాలను ఉంచాడు. ఆ వ్యక్తిని పోలీసులు ఇంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించగా.. తాను బంగారు వ్యాపారనని, కోయంబత్తూర్ లో బంగారం ఆభరణాల అమ్మకం ద్వారా డబ్బులు వచ్చాయని అది తీసుకు వెళుతున్నట్టు తెలిపాడు.
ధరల బాంబు పేల్చిన Honda Cars India.. అమాంతం పెరగనున్న ఆ కార్ల ధరలు..!
ఇందుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ లో ఏకంగా రూ 56.5 లక్షల మొత్తం నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆదాయక పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం.. డబ్బులను ఎలా బైకులో దాచిపెట్టాడో ఈ వీడియోలో మీరు కూడా చూసి, మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.
