Site icon NTV Telugu

Viral Video: ఛీ.. ఛీ.. ఇంత గలీజుగా ఉన్నారేంట్రా.. సె*క్స్ చేస్తావా అంటూ!

Driver

Driver

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో కొన్ని వందల రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. ఇందులో చాలావరకు అవసరం లేని విషయాలు కనబడుతుంటాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే అవసరం అయ్యే విషయాలపై వీడియోలు కనిపిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక క్యాబ్ డ్రైవర్ సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్యాబ్ డ్రైవర్‌కు కస్టమర్ పంపిన అసభ్య మెసేజ్ నెటిజన్లను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.

TG Municipal Elections Live Updates: నేడే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. మీ అభ్యర్థుల భవితవ్యం ఇక్కడ చూడండి..

ఇంతకీ అంతలా ఆ వీడియోలో ఏమున్నదనే కదా మీ అనుమానం.. అసలు ఏం జరిగిందంటే.. విశాల్ అనే క్యాబ్ డ్రైవర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం ఒక కస్టమర్ ఆలయానికి వెళ్లడానికి క్యాబ్ రైడ్ బుక్ చేశారు. రైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ కస్టమర్ డ్రైవర్‌కు వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడడం వీడియోలో కనిపిస్తోంది. రైడ్ బుక్ చేసిన ఆ కస్టమర్ డ్రైవర్ కు మెసేజ్ చేస్తూ.. “హలో బ్రో.. సె*క్స్ చేస్తావా..? ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నంబర్ షేర్ చెయ్” అంటూ సిగ్గులేకుండా మెసేజ్ చేయడం కనపడుతుంది.

Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ అభ్యర్థులు వీరే.. అత్యధికంగా ఆ పార్టీ అభ్యర్థులే!

అయితే క్యాబ్ డ్రైవర్ ఆ అభ్యర్థనను తిరస్కరించగా.. కస్టమర్ వెంటనే రైడ్‌ను క్యాన్సిల్ చేసేశాడు. ఈ ఘటనపై డ్రైవర్ ఆవేదన చెందాడు. ఇంతకుముందు ఇలాంటివి కేవలం బైక్ టాక్సీ డ్రైవర్లకే ఎదురయ్యేవని, కానీ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లకు కూడా తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం ఒకవేళ డ్రైవర్ ప్యాసింజర్కు పంపి ఉంటే కంపెనీ వెంటనే చర్యలు తీసుకుంటుందని, కానీ డ్రైవర్లకు ఇలాంటివి ఎదురైతే కంపెనీలు పట్టించుకోవడం లేదంటూ తన బాధను వెల్లడించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను చూసినవారు డ్రైవర్లతో ఇలాంటి అనుచిత ప్రవర్తన చేయడం తప్పని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో కస్టమర్ల భద్రత మాత్రమే కాకుండా.. క్యాబ్ డ్రైవర్ల భద్రత, కస్టమర్ల ప్రవర్తన వంటి అంశాలను కూడా చర్చకు దారితీసింది.

Exit mobile version