NTV Telugu Site icon

Madhya Pradesh: దారుణం.. చేతులు వెనక్కి కట్టి.. వృద్ధురాలని చితక్కొట్టి..

Woman

Woman

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు తాళ్లతో క‌ట్టేసి కొట్టారు. ఆమెను కులం పేరుతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘ‌ట‌నపై ఖర్గోన్‌ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసి ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్‌కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం ఇండోర్‌లో కూలి పనులు చేస్తూ జీవనం గడుతున్నాడు. దీంతో ఆమె హిరపూర్‌లోని తమ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. అయితే పక్కింట్లో ఉండే గణేశ్‌ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెను దూషిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పూటుగా తాగొచ్చిన గణేశ్‌.. నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్లి తిట్టడం మొదలు పెట్టాడు. అడ్డుకున్న ఆమెను కులం పేరుతో దూషించాడు.

Read Also: Earth Quake: నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

గొడవ పెద్దదవడంతో గణేశ్‌.. భార్య, తల్లి అతనికి తోడయ్యారు. ముగ్గురూ కలిసి ఆ వృద్ధురాలిని ఇంటి నుంచి బయటకు గుంజుకొచ్చారు. రెండు చేతులు వెనక్కి విరిచి తాడుతో కట్టేశారు. అనంతరం ఆమెపై విచక్షణా రహితంగా దాడికి పల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె స్థానికుల సహాయంతో పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు మ‌హిళ‌ల‌తో పాటు మ‌రో వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్ లో న‌మోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల‌పై దాడుల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశామ‌ని వివ‌రించారు. ఆ వృద్ధురాలి ఏ త‌ప్పూ చేయ‌కుండానే స్థానికులు ఆమెతో గొడ‌వ పెట్టుకున్నార‌ని పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి కులాన్ని ప్రస్తావిస్తూ తిట్టార‌ని చెప్పారు.