హెయిర్ కట్టింగ్ కోసం వెళ్ళిన ఒక వ్యక్తికి బార్బర్ గట్టి షాక్ ఇచ్చాడు.. ఎందుకు కొట్టాడో తెలియదు కానీ చెప్పుతోనే కొట్టాడు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సెలూన్‌లో హెయిర్ కట్టింగ్ కోసం వచ్చిన కస్టమర్ జుట్టుకి బార్బర్ షాంపూ పూసి, చెంప దెబ్బ కొట్టాడు. చుట్టూ ఉన్నవారంతా అది చూసి షాకయ్యారు. మరొకరు అతనికి చెప్పు అందించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ చెప్పు అందుకున్న బార్బర్ కస్టమర్‌ను చెప్పుతో కొట్టడం ప్రారంభించాడు.
అసలు కారణం లేకుండా బార్బర్ తనను కొట్టడంతో ఆ కస్టమర్ అయోమయంలో ఉండిపోయాడు.తన చేతిలో ఉన్న చెప్పుని పక్క సీటులో కూర్చున్న యువకుడిపైకి విసిరాడు. విపరీతంగా ప్రవర్తించిన అతడిని చూసి అక్కడ ఉన్నవాళ్లంతా పరుగులు తీశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.. ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు..
ఈ వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ‘ఇది ఎంత అవమానకరం? తమాషా కాదు.. ఇది ఎంతో బాధించేది’ అని.. ‘నాన్సెన్స్ రీల్స్ కోసం ఓ అమాయకుడిని కొట్టడం సరికాదు’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదంతా కావాలని చేశారో? లేక నిజంగానే కస్టమర్ దెబ్బలు తిన్నాడో తెలియదు కానీ ఇలాంటి పనులు చేయడం సరికాదని సదరు వీడియోను చూసిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… కొంచెం కూడా బుద్ది లేదు అంటూ నోటికి వచ్చినట్లు తిడుతున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి.. ఇక ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి…