ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వీడియోలు వస్తూ ఉంటాయి. అయితే ఇందులో చాలా తక్కువ వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతుంటాయి. వీడియోలోని కంటెంట్ బాగుండి కాస్త నవ్వు తెప్పించే విధంగా ఉంటే మాత్రం అవి తొందరగా వైరల్ గా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా పాము, బాతులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వైరల్ వీడియోలో ఓ పాము బాతు గుడ్లను తింటున్న సమయంలో అక్కడే ఉన్న బాతులు చూసి ఏమి చేయలేకపోయిన కనిపించిన బాతులను గమనించవచ్చు. ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Gangs Of Godavari : ఓటీటిలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వీడియోలో కనిపించిన విధంగా ఓ మైదానం చివరన బాతులు గుడ్లు పెట్టాయి. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని పాము బాతు గుడ్లను తినడం మొదలుపెట్టింది. అదే పాము గుడ్లు తినడం అక్కడే ఉన్న బాతులు చూస్తున్న గాని పాముని ఏమాత్రం తోలడానికి ధైర్యం చేయలేక ఉన్న బాతులను మనం అక్కడే చూడొచ్చు. పాము మాత్రం తనకి ఇష్టం వచ్చినట్లుగా బాతు గుడ్లను తినేస్తోంది. ఇంతలోనే అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు ఆ దృశ్యాన్ని చూశారు. ముందుగా ఆ పాము నుండి గుడ్లను కాపాడాలా లేదా అని ఆలోచించినవారు.. ఆ తర్వాత ఓ వ్యక్తి ధైర్యం చేసి పాము తలను ఒక్కసారిగా పట్టుకొని జాగ్రత్తగా చాలా దూరం వరకు తీసుకువెళ్లి విసిరేశాడు.
ఇక పాము వెళ్ళిపోవడంతో ఆనందంతో ఆ బాతులు మళ్ళీ వచ్చి గుడ్లు పొదిగేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ చాలా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ముందుగా దేవుడిలా వచ్చిన వ్యక్తిని శభాష్ అంటూ చాలామంది ప్రశంసిస్తున్నారు. మరొకరు., ఒక జీవికి మరో జీవి ఆహారం కావడం ప్రకృతి ధర్మం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. కాస్త విడ్డూరంగా ఇలాంటి చేయడం వల్ల ప్రకృతి సమతోల్యాన్ని దెబ్బతీయటమే అంటూ కామెంట్ చేస్తున్నారు.