Viral News: ప్రపంచంలో అప్పుడప్పుడూ ఆశ్చర్యకరమైన బ్యాంకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌కి చెందిన గ్రేటర్ నోయిడాలో జరిగింది. అదికూడా రెండు నెలల క్రితం మరణించిన ఓ మహిళ బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా రూ.1.13 లక్షల కోట్లు జమ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రి దేవి అనే మహిళ ఇటీవల మరణించగా, ఆమె కుమారుడు 19 ఏళ్ల దీపక్ తన తల్లి ఖాతాను నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి అతడి తల్లి ఖాతాకు సంబంధించి వచ్చిన ఓ మెసేజ్ చూసి మైండ్ దిమ్మతిరిగేలా అనిపించింది. ఆ మెసేజ్‌లో 10,01,35,60,00,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 అంటే సుమారుగా రూ.1.13 లక్షల కోట్లు పైగా అకౌంట్ లోకి డబ్బులు క్రెడిట్ అయినట్లు చూపించింది.
మొదట దీపక్ ఇది ఏదో టెక్నికల్ గ్లిచ్ అనుకున్నాడు. కానీ, స్నేహితులు కూడా ఆ డబ్బు అకౌంట్ లో క్రెడిట్ అయ్యిందని ధృవీకరించడంతో, ఖాతాలో ఉన్న మొత్తాన్ని చూసి అతడు షాక్‌కు గురయ్యాడు. దానితో సోమవారం ఉదయం కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చాడు. బ్యాంక్ అధికారులు అక్కడ జరిగిన విషయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానితో వెంటనే సదరు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత అధికారులు విషయాన్నీ ఆదాయపు పన్ను (Income Tax) శాఖకు తెలియజేశారు.
Oben Rorr EZ Sigma: సింగల్ ఛార్జ్ 175km రేంజ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! కొత్త EV బైక్ లాంచ్
ఈ సంఘటన క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలలో వైరల్ కావడంతో దీపక్‌కి ఫోన్ కాల్స్ వరదలా వచ్చాయి. బంధువులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు అందరూ ఆ డబ్బు ఎలా వచ్చిందని అడుగుతూ తెగ ఇబ్బంది పెట్టారు. దానితో ఆ అబ్బాయి ఒత్తిడికి తాళలేక చివరికి తన ఫోన్‌నే స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇంత పెద్ద మొత్తం గాయత్రి దేవి ఖాతాలోకి జమ కావడంపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ డబ్బులు ఏదైనా బ్యాంకింగ్ లోపం వల్ల జరిగిందా? లేక టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందా? లేదా ఏదైనా అక్రమ మనీలాండరింగ్ విషయంలో ఏదైనా లావాదేవీలు జరిగాయా అని అనుమానులు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇప్పటి వరకు ఈ డబ్బులపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఈ కేసుపై ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? మరణించిన వ్యక్తి ఖాతాలోకి ఎందుకు జమ చేశారు? అనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. చూడాలి మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు తేల్చాలి.
नोएडा में 20 साल के दीपक के कोटक महिंद्रा बैंक खाते में 36 डिजिट की धनराशि आई है।
ये रकम 1 अरब 13 लाख 56 हजार करोड़ रुपए बैठती है।
मेरा गणित थोड़ा कमजोर है। बाकी आप लोग गुणा-भाग कर सकते हैं।
फिलहाल इनकम टैक्स विभाग जांच कर रहा है। बैंक खाता फ्रीज कर दिया गया है। pic.twitter.com/cLnZdMKozD
— Sachin Gupta (@SachinGuptaUP) August 4, 2025
