తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో సహా తన ముగ్గురు ఆడపిల్లలను అతికిరాతకంగా చంపేశాడు. ఆ వ్యక్తి ఇదివరకే ఓ కూతుర్ని చంపి జైలు నుంచి బయటకు వచ్చాడు. బీహార్ రాష్ట్రంలోని చంపారం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఇదు మియాన్, అతని భార్య అఫ్రీన్ ఖాతున్. వీరిద్దరికీ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వారు అర్బున్ ఖాతున్ (15), షబ్రున్ ఖాతున్ (12), షెహ్బాజ్ ఖతున్ (9).
Also read: Padmavati Express: సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..
అయితే వీరికి మగ బిడ్డ కావాలనుకోవడంతో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో అతడు నిరాశ చెందాడు. దాంతో పలుమార్లు ఈ విషయంపై భర్త భార్యను హింసిస్తున్నట్లు సమాచారం. ఇలా ఉండగా.. గురువారం రాత్రి వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపద్రకుడైన భర్త భార్యతో సహా తన ముగ్గురు ఆడబిడ్డలను సైతం గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత అక్కడ నుంచి అతడు పరారయ్యాడు.
Also read: Memantha Siddham Bus Yatra: నాల్గో రోజుకు చేరిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆ ఇంటి వైపు నుంచి వెళుతున్న స్థానికులకు నేల మీద రక్తం మరకలు కనిపించడంతో విషయాన్ని వెంటనే పోలీసులకు అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఓ మహిళ, ముగ్గురు పిల్లల మృతదేహాలు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విషయం సంబంధించి పోలీసులు పరారీలో ఉన్న ఇదు మియాన్ పట్టుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. ఇక అతని గురించి వివరాలు సేకరిస్తున్న సమయంలో ఇదివరకు తన పదహారేళ్ల కూతుర్ని కూడా ట్రైన్ లో నుంచి తోసేసి తన బిడ్డని చంపినట్లు తెలిసింది. అందుకని అతడు ఐదేళ్ల శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నట్లు తెలుస్తోంది.
