Site icon NTV Telugu

Terrorists Arrested: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. ఇద్దరు అరెస్ట్..!

Terrorists

Terrorists

ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మంగళవారం రాత్రి మహమ్మద్ జావిద్ తో పాటు అతని కూతురు ఖతిజాను అదుపులోకి తీసుకున్నారు. జావిద్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్‌ సర్కారు కొత్త నిబంధన!

తండ్రి కూతుర్లు టోలి చౌక్ లో నివాసం ఉంటున్నారు. బక్రీద్ పండగ కోసం తండ్రి కూతుర్లు గోదావరిఖనికి వచ్చినట్టు సమాచారం. అయితే తండ్రి కూతుర్లు ఏ టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు.. వీరి ప్రమేయం ఎంత మేర అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సాంకేతికంగా టెర్రరిస్ట్ సంస్థలకు సహకరిస్తున్నారా లేక ఇతరాత్ర సహాకారం అందిస్తున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఉగ్ర కార్యక్రమాల్లో చురుగ్గా తండ్రికూతుళ్లు పాల్గొన్నారని సమాచారం మేరకు.. కేవలం అనుమానితులుగా మాత్రమే వీరిని తీసుకెళ్తున్నామని ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసు అధికారులకు తెలిపాయి. వీరి ఆచూకి తెలుసుకుని మరీ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చి అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

Read Also: Inflation: ‘టమాటా’ బాటలోనే ‘ఉల్లి’.. ఆర్బీఐ ఏం చేయబోతుంది?

ఏది ఏమైనా మరో సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఐఎస్‌కేపీ ఉగ్రవాద లింకులు బయటపడటంతో సూరత్‌కు చెందిన సుబేరా భానుతో పాతబస్తీవాసి ఫసీతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దేశంలో ISKP ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీనగర్‌కు చెందిన నాసీర్‌, హయత్‌, అజీమ్‌లతో కూడిన ముఠా సభ్యుల్ని సుబేరా భాను సురత్‌కు పిలిచింది. అయితే, ఉగ్ర కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫసీని కూడా గుజరాత్‌ ఏటీఎస్‌ టీమ్ అదుపులోకి తీసుకుంది.

Exit mobile version