Site icon NTV Telugu

NIA: మణిపూర్‌‌లో హింసకు మయన్మార్‌లో ప్లాన్: ఎన్‌ఐఏ

Manipour

Manipour

మణిపూర్ రాష్ట్రంలో హింసకు మయన్మార్ లో ప్లానింగ్ జరిగినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. గతేడాది మణిపూర్ లో రెండు జాతుల మధ్య గొడవలో పాల్గొనేందుకు యువకులకు తుపాకులతో శిక్షణ ఇచ్చారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. మోటి వర్గానికి చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు కేవైకేఎల్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలకు చైనా -మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించే ఎన్ఎస్‌సీఎన్ (ఐఎం) సంస్థ ఆయుధాలను పంపిణీ చేసినట్లు ఛార్జ్ షిట్ లో వెల్లడించింది. సాయుధ పోరాటానికి అవసరమైన ఇతర సామగ్రిని కూడా అందిచినట్లు పేర్కొనింది. ఈ మేరకు మార్చ్ 27న అసోం రాజధాని గౌహతిలోని కోర్టుకు ఎన్ఐఏ ఇచ్చిన ఛార్జిషీట్ లో ఈ విషయాలను తెలిపింది.

Read Also: Raju Yadav :ఉన్న ఒక్క సినిమా కూడా పోయింది.. రాజు యాదవ్ పై గెటప్ శ్రీను పోస్ట్..

కాగా, మణిపూర్‌లో శాంతిభద్రతల సమస్య సృష్టిచేందుకు మయన్మార్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రే కూకీ, మోటీ జాతుల మధ్య ఘర్షణ అని ఎన్ఐఏ చెప్పుకొచ్చింది. మయన్మార్ పాత్ర గురించి కేంద్ర ప్రభుత్వానికి సైతం సమాచారం ఇచ్చినట్లు ఎన్ఐఏ తెలిపింది. కేవైకేఎల్, పీఎల్ఏలకు ఎన్ఎస్సీఎన్ఐ(ఎం) ఆయుధాలు, పేలుడు పదార్థాలు సేఫ్గా తరలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేసింది. మయన్మార్‌కు చెందిన వారికి సారవంతమైన భూములు అందించి.. ఉగ్రసంస్థలు దోపిడీకి పాల్పడ్డారని ఛార్జ్ షిట్ లో వివరించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దోచుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో కుకీ- జో కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ వెల్లడించింది. కుకీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక దాడులకు కుట్ర చేసినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో తేలిందని ఛార్జిషీటులో స్పష్టం చేసింది.

Exit mobile version