NTV Telugu Site icon

PM Modi: బెంగాల్ బీజేపీ శ్రేణులకు మోడీ కీలక సందేశం

Soem

Soem

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ బీజేపీ శ్రేణులకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలవాలని.. నిర్భయంగా ఓట్లు వేసేలా వారిని ప్రోత్సహించాలని కోరారు. పశ్చిమబెంగాల్ పార్టీ కార్యకర్తలతో బుధవారం ప్రధాని మోడీ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Karnataka: హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో హింసే అతి పెద్ద సవాల్ అని ప్రధాన మోడీ అన్నారు. బెంగాల్‌లో బీజేపీ గెలుపు స్థానాలు ఈసారి పెరుగుతాయని మోడీ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజల భద్రత కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు మోడీ చెప్పారు. 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని 42 స్థానాల్లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. 2014తో పోల్చుకుంటే బీజేపీ భారీగానే సీట్లు దక్కించుకునంది. 2014లో బీజేపీ కేవలం 2 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

ఇది కూడా చదవండి: Mukhtar Ansari: ముఖ్తాన్ అన్సారీ మరణం.. భయంతో టొమాటోలు తింటున్న ఖైదీలు..

సందేశ్‌ఖాలీ ఘటనతో పశ్చిమబెంగాల్ అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్.. భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అనంతరం బీజేపీ వారికి మద్దతు నిలిచింది. అంతేకాకుండా ఇటీవల బెంగాల్ పర్యటనలో ప్రధాని మోడీ కూడా బాధిత మహిళలతో సమావేశమై.. వారికి జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఓదార్చారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో సందేశ్‌ఖాలీ స్థానం నుంచి బాధిత మహిళను బీజేపీ రంగంలోకి దింపింది. ఆమెతో కూడా మోడీ ముచ్చటించారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Vasantha Krishna Prasad: డబ్బులు లేకే పెన్షన్‌ పంపిణీ వాయిదా..!