NTV Telugu Site icon

Vinesh Phogat: స్వదేశానికి విచ్చేసిన భారత స్టార్‌ రెజ్లర్‌.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్

Vinesh Phogat

Vinesh Phogat

Vinesh Phogat: భారత స్టార్‌ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వినేష్ ఢిల్లీకి తిరిగి రావడానికి ముందే, భారత రెజ్లర్ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రెజ్లర్‌ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు ఆమె ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే బిగ్గరగా చీర్స్‌తో స్వాగతం పలికారు. అభిమానులను చూసిన వినేశ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వినేష్‌కు మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా స్వాగతం పలికారు. వారు పారిస్ వినేశ్‌ను కౌగిలించుకొని అభినందించారు. పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫోగట్‌.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా వినేశ్‌ ఫోగట్‌కు సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టిపడేసింది. కానీ వినేశ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచింది.

Read Also: Siddaramaiah: చిక్కుల్లో సిద్ధరామయ్య.. భూకుంభకోణం కేసులో జరగనున్న విచారణ

జపాన్‌కు చెందిన గొప్ప ఆధునిక రెజ్లర్‌లలో ఒకరైన యుయి సుసాకిని ఓడించి, డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే తన కల చెదిరిపోయిన తర్వాత వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే.. తాజాగా వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై శుభవార్త చెప్పింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది. రెజ్లింగ్‌లో పునరాగమనం చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చింది. 2032 వరకు ఆడాలనుకున్నట్లు వినేశ్ చెప్పింది. వినేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో “నా టీమ్‌కి, నా తోటి భారతీయులకు మరియు నా కుటుంబానికి, మేము పని చేస్తున్న, సాధించాలనుకున్న లక్ష్యం అసంపూర్తిగా మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. ఎప్పుటికీ ఇలా జరగదు. అన్ని విషయాలు ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు ఆడగలుగుతాను, నాలో పోరాటం, కుస్తీ ఎప్పుడూ ఉంటుంది.” అని పోస్ట్ లో పేర్కొంది.