వివి వినాయక్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . తెలుగు ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి సరి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు వినాయక్… కమర్షియల్ సినిమాను తన మేకింగ్‌తో సరి కొత్త పంథా ను పరిచయం చేసాడు వినాయక్. అయితే కొన్నేళ్లుగా ఈ దర్శకుడికి సరైన విజయం లభించలేదు.చాలా రోజుల తర్వాత వినాయక్ తరువాత సినిమా పై చర్చ మొదలైంది.ఆది సినిమాతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన వినాయక్ టాలీవుడ్ లో స్టార్ హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ ను అందించారు. ఆయన కెరీర్‌లో ఎన్నో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు రాజమౌళి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు దర్శకుడు వినాయక్. అయితే అఖిల్ సినిమా తర్వాత ఈయన గ్రాఫ్ పడిపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన అఖిల్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది..
ఆ తర్వాత ఇంటిలిజెంట్ సినిమా తో మరో డిజాస్టర్ ను అందుకున్నాడు.అయితే మెగాస్టార్ తో తెరకెక్కించిన ఖైదీ నెం 150 హిట్టైనా కూడా అది పూర్తిగా చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది.. పైగా రీమేక్ కావడంతో వినాయక్‌కు అంతగా క్రెడిట్ రాలేదు. 2018 తర్వాత తెలుగులో వినాయక్ సినిమా చేయలేదు.. ఈ మధ్యే హిందీలో చత్రపతి రీమేక్ చేసినా కూడా ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో బయట కూడా కనిపించడం మానేసారు దర్శకుడు వినాయక్… ఇలాంటి టైమ్‌లో మాస్ రాజా రవితేజతో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది… కానీ ఆ వార్త లో నిజం లేదు. రవితేజ తో గతం లో కృష్ణ సినిమాను చేసాడు వినాయక్. కొన్ని రోజుల కింది వరకు రవితేజ తో డిస్కషన్ నడిచిందని కానీ కథ వర్కవుట్ అవ్వక ఆ ప్రాజెక్ట్ వదిలేసారని సమాచారం.. కానీ వినాయక్ మెగాస్టార్ చిరు కోసం మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు.. మెగా 156 ఓపెనింగ్‌లో ఈ డైరెక్టర్ కనిపించడానికి కారణం కూడా అదే అని తెలుస్తుంది. మెగాస్టార్ తో ఎలాగైనా మరోసారి సినిమాను తీయాలనుకుంటున్నాడుట.. మరి మెగాస్టార్ వినాయక్ కు ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి…