NTV Telugu Site icon

Vikrant Massey : మాట తప్పాడు.. మడమ తిప్పాడు..

Vikrant

Vikrant

టీవీ ఇండస్ట్రీ నుండి వచ్చి ఫేమ్ తెచ్చుకున్నాడు విక్రాంత్ మాస్సే. రీసెంట్లీ సబర్మతి రిపోర్ట్ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఎట్రాక్ట్ చేయలేదు. ప్రజెంట్ అతడి చేతిలో టూ, త్రీ ఫిల్మ్ ఉన్నాయి. అయితే సడెన్‌గా ఓ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని, భర్తగా, తండ్రిగా, కొడుకుగా, నటుడిగా బ్యాక్ టు హోం అంటూ సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నాడు.

Also Read : Pushpa 2 : రాజమౌళి మాటలను నిజం చేసిన చుపించిన సుకుమార్

ఇదిగో ఈ నోటే విక్రాంత్ మాస్సేను ఒక్కసారిగా వార్తల్లో నిలిచేలా చేసింది. ఇంత కష్టపడి.. 37 ఏళ్లకే రిటర్మెంట్ ఏంటీ అంటూ ప్రశ్నించుకున్నారు బాలీవుడ్ ఆడియన్స్ అండ్ సినీ వర్గాలు. ఇక సెలబ్రిటీలు స్పందించడం స్టార్ట్ చేశారు. మీడియా కూడా హై లెవల్లో ఎలివేషన్ ఇచ్చింది. దీంతో ఖంగుతిన్న విక్రాంత్ ‘తూచ్ నేను ఆ మాట అనలేదు.  జనాలే సరిగా అర్థం చేసుకోలేదు. కొంచెం రెస్ట్ కావాలి అందుకే జస్ట్ బ్రేక్ తీసుకుంటున్నా, కానీ రిటైర్ మెంట్ ఇవ్వట్లేదన్నాడు. కొంచెం హోమ్ ను మిస్సయ్యా. అలాగే కాస్త ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ల్యాంగ్ గ్యాప్ మాత్రమే తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు ఈ హసీనా దిల్ రుబా నటుడు. మొత్తానికి సినిమాలతో కన్నా ఒక్కపోస్టుతో లైమ్ లైట్లోకి వచ్చాడు విక్రాంత్. చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకోబోతున్నాడు. మరీ ఇప్పుడు చెప్పిన మాట మీదే ఉంటాడో లేదా తూచ్ అని మళ్ళి మనసు మార్చుకుంటాడో  అని సోషల్ మీడియా వేదికాగా నెటిజెన్స్ జోక్స్ పేల్చుతున్నారు.

Show comments