NTV Telugu Site icon

Vikarabad SP: తండ్రి దొంగ.. కొడుకు గజదొంగ.. ఇద్దరిపై 105 కేసులు!

Vikarabad

Vikarabad

తండ్రి కొడుకుకు ఆదర్శంగా ఉండాలి. తన కుమారుడు సమాజంలో తనకంటు ఓ మంచి పేరు తీసుకురావాలని తండ్రి కలలు కంటాడు. కానీ.. ఇక్కడ తండ్రి దొంగ అయితే.. తన కొడుకు గజదొంగగా మారాలని ఆశించాడు. తండ్రిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 70 కు పైగా కేసులు ఉంటే.. అతితక్కువ వయసులో పుత్రుడు మాత్రం 42 కేసులను క్రాస్ చేశాడు. వీరిని పట్టుకోవడంలో వికారాబాద్ పోలీసులు విజయం సాధించారు. అసలు విషయం ఏమిటంటే.. వికారాబాద్ పోలీసులు ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. ఇద్దరు దొంగల పైన 105 కేసులు ఉన్నాయని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్పీ సమాచారం మేరకు.. తండ్రి కొడుకు ఇద్దరు దొంగలే. వీళ్లను షికారి గ్యాంగ్ దొంగలు అంటారు. వీళ్ళ ఇద్దరిదీ ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్. ఇద్దరు దొంగల పైన ఇప్పటికే రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఇద్దరు దొంగలను పూణేలో పట్టుకున్నారు.. వికారాబాద్ పోలీసులు. ఇద్దరి నుంచి ఏడుతులలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మహారాష్ట్ర, తమిళనాడులోని ఈ ఇద్దరిపై కేసులు ఉన్నాయి. 30/6/2024 రోజున పరిగి పట్టణంలోని ఐదు ఇళ్లలో ఈ షికారి గ్యాంగ్ చోరీ చేసింది. వీళ్లు దొంగతనం చేయడానికి ప్రతి సారి ఒక కొత్త వ్యక్తిని తమ వెంట తీసుకోస్తారు.

READ MORE: Bulldozer action: ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..

ఈ షికారి గ్యాంగ్ రైలు, బస్సు మార్గంలో వచ్చి తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. పగలు రక్కి నిర్వహిస్తారు.. రాత్రి చోరీ చేస్తారు. ఏ వన్ పెద్ద సర్దార్ (రాజు ) తండ్రి. ఏ టూ మద్దిలేటి మధవ కొడుకు. ఏ వన్ తండ్రి పైన 70 కు పైగా దొంగతనం కేసులు అదేవిధంగా కొడుకు మాధవ పైన 42 కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా సిసిటి ఎస్ఎస్ పోలీసులు ఈరోజు తండ్రి, కొడుకు ను మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసును చేదించడంలో ఉన్న పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ రివార్డు ఇవ్వడం జరిగింది.