వికారాబాద్ జిల్లాలో ఈనెల 21న తాండూర్ మోర్ సూపర్ మార్కెట్లో షెటర్ లిఫ్ట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఈ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో చేధించారు. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలను తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. అయితే, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. కర్ణాటక రాష్ట్రం కల్బురిగి జిల్లా లోని సేడం తాలూకా సాలార్ కోర్ట్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులుగా గుర్తించారు. వారు కోరుకు నవీన్, కురువ శ్రీనివాస్, సుగ్గల సంజీవ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు.
Read Also: Man Struck In Shop: మసాజ్ చైర్ లో పడుకున్న వ్యక్తికి వింత అనుభవం.. ఏం జరిగిందంటే
అయితే, ఈ నేరం తామే చేశామని ఒప్పుకున్న నిందితుల దగ్గర నుంచి మోర్ సూపర్ మార్కెట్ కు సంబంధించిన చోరీ కేసులో లక్ష డెబ్బై వేల రూపాయలు రికవరీతో పాటు రెండు బైకులు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక, అంతరాష్ట్ర ముఠా నిందితులు ఆరు నేరాల్లో పాల్గొన్నారుని డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. కొడంగల్ లో వీరిపై మూడు దొంగతనం కేసులు.. ఓ బట్టల షాపులో బట్టల దొంగతనం, బంగారు షాపులో వెండి పాత్రలు.. మొబైల్ షాప్ లో ల్యాప్ టాప్, మొబైల్ సామాగ్రి చోరీ చేసినట్లు తాండూర్ డీఎస్పీ చెప్పుకొచ్చారు.
Read Also: Russia: రష్యా విమానం ప్రమాదం.. 10 మృతదేహాలు, ఫ్లైట్ రికార్డర్‌లు వెలికితీత
ఇక, కర్ణాటక రాష్ట్రం ముధోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నేరాలకు పాల్పడినట్లు తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన డబ్బా సంజీవ మరో నేరస్థున్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతను కర్ణాటకలో పలు దొంగతనాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అక్కడి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరుగుతుందని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.