టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఇటీవల అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది బందుమిత్రుల సమక్షంలో జరిగింది. అయితే అధికారంగా వీరి నిశ్చితార్ధాన్ని అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
Also Read : Star Kids : యాక్టింగ్ వద్దని.. డైరెక్టర్లుగా మారిన స్టార్ కిడ్స్
అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో తొలిసారి విజయ్ దేవరకొండ మీడియా ముందుకు వచ్చాడు. గడిచిన ఆదివారం అనగా అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. కుటుంభ సభ్యులతో కలిసి విజయ్ పుట్టపర్తికి వచ్చాడు. విజయ్ దేవరకొండ ప్రశాంతి నిలయంకు చేరుకోగా, శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆ సమయంలోనే విజయ్ చేతికి ఉన్న రింగ్ కనిపించింది. రష్మికతో నిశ్చితార్థం తర్వాత తొలిసారి బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ చేతికి ఉన్న రింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు విజయ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ సైతం ఈ ఫోటోను లైక్ చేస్తూ నూతన జంటకు విశేష్ చెప్తున్నారు. వెండితెరపై మెరిసిన గీత గోవిందం జంట నిజజీవితంలో ఒక్కటయిన సందర్భంగా అభిమానులు తమ హీరోకు స్పెషల్ విషెష్ చెప్తున్నారు. మరి విజయ్ – రష్మికల నిశ్చితార్థంను అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్టారో చూడాలి.
