NTV Telugu Site icon

Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక మినీ ఇండియా..

Sujana

Sujana

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ పైలా సోమి నాయుడు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలను చూశా… ప్రపంచం మొత్తం తిరిగానన్నారు. కృష్ణా జిల్లా నా పుట్టినిల్లు.. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగడాన్ని భగవంతుడి వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలకు సేవలందించేందుకే భగవంతుడు పంపాడనుకుంటున్నానని అన్నారు. సూర్య చంద్రులున్నంతవరకు విజయవాడ వెస్ట్ కు సేవలందిస్తానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని సమస్యలున్నాయి… కొండప్రాంతంలోని సమస్యలు తన కళ్ళు తెరిపించాయని చెప్పారు.

MI vs RCB: నేడు ఐపీఎల్‌ లో బిగ్‌ ఫైట్‌.. కాకపోతే..?

డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం అని సుజనా చౌదరి తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మునిగిపోవడం ఖాయం అని పేర్కొన్నారు. మరోవైపు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక మినీ ఇండియా అని అన్నారు. తనను గెలిపించుకోవడం, తనతో పని చేయించుకోవడం నియోజకవర్గ ప్రజల బాధ్యత అని చెప్పారు. కుల మత ప్రతిపాదికన నాయకులు రాకూడదు.. మనదంతా మానవ కులం అని అన్నారు. ఈ సందర్భంగా.. పశ్చిమ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని సుజనా చౌదరి తెలిపారు.

PM Modi: వాళ్ల సొంతగడ్డపైనే ఉగ్రవాదుల్ని లేపేస్తున్నాం.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే.. పైలా సోమినాయుడు మాట్లాడుతూ.. వైసీపీ తమకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడినా జగన్ సమయం ఇవ్వలేదన్నారు. సుజనాలాంటి నేతలు బరిలో దిగడం తమ అదృష్టం అని అన్నారు. సుజనా గెలుపునకు కృషి చేస్తాం.. సుజనా కోసం ఇంటింటికీ ప్రచారం చేస్తా.. సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే సామర్థ్యం సుజనా చౌదరికి ఉంది.. రాబోయే రోజుల్లో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఉన్న పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సుజనా చౌదరితోనే సాధ్యం అని చెప్పారు. బీజేపీ కండువా వేసుకున్నాక గర్వంగా ఉందని పైలా సోమినాయుడు తెలిపారు.