Vijayawada Police: బెజవాడలో తొలిసారి మహిళకు నగర బహిష్కరణ శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ పోలీసులు నేరస్థుల పాలిట సింహ స్వప్నంలా మారుతున్నారు. తొలిసారి ఓ మహిళను నగర బహిష్కరణ శిక్ష వేశారు బెజవాడ పోలీసులు.బెజవాడలో తొలిసారిగా ఓ లేడీ కిలాడీకి నగర బహిష్కరణ శిక్ష విధించడం హాట్ టాపిక్ అవుతోంది. ఫోటోలో ఉన్న మహిళ పేరు సారమ్మ అలియాస్ శారద. పేరు సాఫ్ట్‌గానే ఉన్నా ఈవిడ మాత్రం ఖతర్నాక్. పోలీసుల కళ్లుగప్పి దందాలు చేయడంలో దిట్ట. ఇప్పటికే సారమ్మపై అజిత్‌సింగ్ నగర్ పీఎస్‌లో 13 కేసులున్నాయి. గంజాయి అమ్మడం మొదలు చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది. ఈమెపై పోలీసులు నిఘా పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఆమెలో మార్పు రాలేదు.
Read Also: Margani Bharat Ram: లోకేష్ పాదయాత్రతో ఉపయోగం లేదు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు పెట్టినా తీరు మారకపోవడంతో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. కఠిన శిక్షకు సిద్ధం అయ్యారు. సారమ్మ అలియాస్ శారదకు చివరికి నగర బహిష్కరణే మార్గమని భావించిన పోలీసులు అదే నిర్ణయాన్ని అమలు చేశారు. ఈమెతోపాటు 19 మందిని సిటీ నుంచి బహిష్కరించారు. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ఈ నగర బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు. మరోసారి వీళ్లు గంజాయి కేసుల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ క్రాంతి రాణా టాటా వార్నింగ్ ఇచ్చారు. నగర బహిష్కరణకు గురైన వారిలో సారమ్మ అనే మహిళ ఉండడం.. తొలిసారిగా ఓ మహిళపై సీరియస్ యాక్షన్ ఉండడం చర్చనీయాంశమైంది. ఇలాంటి శిక్షల వల్లనైనా నేరస్తుల్లో మార్పులు వస్తాయేమో చూడాలి.
Read Also: Kiara Advani: పెళ్లి తరువాత కియారా న్యూడ్ ఫోటో.. బయటపడింది ఇలా
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!