Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం మూడు గంటల వ్యవధిలోనే పడిన కుండపోత వర్షానికి బెజవాడ చిగురుటాకులా వణికిపోయింది. అకస్మాత్తుగా ముంచెత్తిన ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. ఈ నీటిలో ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుని పూర్తిగా మునిగిపోవడం వర్షం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదేవిధంగా.. నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కూడా వర్ష ప్రభావం పడింది. దుర్గగుడి ఘాట్ రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో పాటు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భద్రతా చర్యల్లో భాగంగా దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు వెంటనే మూసివేశారు.
Also Read
దుర్గగుడి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు, వాహనదారులు గంటల తరబడి నానా తంటాలు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయని లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నిత్యావసర సరుకులు కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ , విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం తగ్గినప్పటికీ ముంపు ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచి ఉండటంతో ప్రజల సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగర యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!