ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సారథ్యంలోని బీఆర్ఎస్‌లోకి ఏపీ నుంచి చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా బెజవాడ మాజీ మేయర్ తాడి శకుంతల ఆ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. 2005-06లో ఏడాదిపాటు విజయవాడ మేయర్‌గా పనిచేశారు తాడి శకుంతల. శకుంతలతోపాటు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు పలువురు నేతలు. బీఆర్ఎస్‌లో చేరికకు ముందు వైసీపీలో కొనసాగుతున్నారు శకుంతల. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా, నిన్న విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల పార్టీ కండువా కప్పుకున్నారు.
గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మల్యాద్రి సహా పలువురు మైనారిటీ నేతలు పార్టీలో చేరారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి కాంగ్రెస్, టీడీపీల్లోనూ కొంతకాలం పనిచేశారు.
Read Also: Ap Governor Justice Abdul Nazeer: ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం
ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలిగా మారారు. రాబోయే కాలంలో మరింత మంది ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరతారని అంచనా వేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏపీలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది 175 సీట్లలో పోటీకి సిద్దమవుతుంది. రాష్ట్రంలో కనీసం పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించలేదు. కనీసం కార్యకర్తలు లేకపోయినా, పేరుకు చెప్పుకునేందుకు కనీసం ఒకరిద్దరు నాయకులు కూడా లేని పార్టీ 175 సీట్లలో పోటీ చేయబోతుందని ప్రకటించడం రాజకీయవర్గాలను ఆలోచనలో పడేసింది. తోట చంద్రశేఖర్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది. బీఆర్ఎస్ ఏపీలో పోటీచేస్తే దాని ప్రభావం టీడీపీ, జనసేన, బీజేపీలపై పడుతుందని.. పరోక్షంగా వైసీపీకి లాభం చేకూరుస్తుందని అంటున్నారు.
Vijayawada ex mayor tadi shakuntala joins in BRS