Vijayawada Cyber Fraud: ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.24 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!.. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఖాళీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Cyber Fraud: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. విజయవాడలోని పెజ్జోనిపేటకు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.24 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడికి తెలియకుండానే బ్యాంకు ఖాతాలోని నగదుతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్మును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. ఇంటి నిర్మాణం కోసం ఎంతోకాలంగా దాచుకున్న డబ్బు క్షణాల్లో మాయమవడంతో వృద్ధుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి అక్టోబర్ 20వ తేదీ నుంచే అనధికారిక లావాదేవీలు జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని బాధితుడు వెంటనే గుర్తించలేకపోయాడు. నవంబర్ 4వ తేదీన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అలర్ట్ ఈ-మెయిల్స్ రావడంతో తన ఖాతాలో నగదు మాయమైన విషయాన్ని గుర్తించాడు. వెంటనే బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలించగా, తనకు తెలియకుండానే ఖాతాలోని నగదుతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలోని సొమ్ము కూడా మాయమైనట్లు గుర్తించాడు. మొత్తం రూ.24 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 20 నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీల వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. నగదు ఏయే ఖాతాలకు బదిలీ అయింది? ఈ మోసం వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
-
Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
ట్రెండింగ్
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!