Vijayawada: భవానిపురంలో కారు బీభత్సం.. నిందితులు అరెస్ట్, పరారీలో మరోకారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానిపురం బేరం పార్క్ సమీపంలో జరిగిన కారు బీభత్సం ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన వెంటనే భవానిపురం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్ర గాలింపు చేపట్టారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Snake Bite: ‘నన్ను పాము కరిచింది..’ అంటూ వేసుకున్న జాకెట్ తెరిచి..!
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్‌శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
ఈ ఘటనకు సంబంధించి ఏడీసీపీ రామకృష్ణ కీలక వివరాలు వెల్లడించారు. కరుడు కట్టిన పాత నేరస్తులు, రౌడీషీటర్లైన కొండా యోహావా అలియాస్ పెద్ద చిచ్చా, కొండా రమేష్ అలియాస్ చిన్న చిచ్చా, వీర్ల భార్గవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జక్కుల దినేష్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు.
నిందితుల నేర చరిత్రను పరిశీలిస్తే పెద్ద చిచ్చాపై మొత్తం 18 కేసులు, చిన్న చిచ్చాపై ఏకంగా 42 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్న చిచ్చా గతంలో పది నెలల పాటు జైలు శిక్షను కూడా అనుభవించినట్లు తెలిపారు. వీరి నేర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీసీపీ స్పష్టం చేశారు.
Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్‌ను పెడుతున్నారా?.. డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!
ఈ ప్రమాదంలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడగా, మరికొందరు స్వల్ప గాయాల పాలయ్యారు. ర్యాష్ డ్రైవింగ్‌కు ఉపయోగించిన కారు రిపేర్ నిమిత్తం వచ్చినదే అయినప్పటికీ, నిందితులు దానిని జల్సాల కోసం వాడినట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. భవానిపురం ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!