మెదక్ లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ కోట్ల భూములు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తుందని, సీఎం కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందన్నారు. బీజేపీ కేసీఆర్ అవినీతి పై మాట్లాడుతది కానీ చర్యలు ఉండవన్నారు విజయశాంతి. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటయ్యాయని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను గద్దె దించేవరకు నిద్రపోనని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణకి సీఎం కేసీఆర్ ఏం చేశారని ఓటు వేయాలి..? తెలంగాణ లో బెల్ట్ షాపులు పెట్టి అక్క చెల్లెళ్ళ తాళిబొట్టు తెంపినందుకు ఓటువేయలా..? అని ఆమె ప్రశ్నించారు.
Devendra Fadnavis: అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే మెడల్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీకే..
విద్యార్థులకు డ్రగ్స్,గంజాయి అలవాటు చేసినందుకు వేయలా..? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు తిన్నందుకు ఓట్లు వేయలా..? అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలన్న విజయశాంతి మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో ఇంకా కొట్లాడుతున్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీతో తెలంగాణా ఏ మాత్రం అభివృద్ధి చెందదని పేర్కొన్న విజయశాంతి తెలంగాణా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. తమ ముందు ఉంది ఏకైక లక్ష్యమని, కేసీఆర్ సర్కార్ ను కూలగొట్టటమే తమ కర్తవ్యమని విజయశాంతి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని ఓటర్లకు విజయశాంతి విజ్ఞప్తి చేశారు.
David Warner: ఇప్పట్లో రిటైర్మెంట్ ఉండదు.. ప్రపంచ కప్ 2027 ఆడతా..!