Site icon NTV Telugu

Vijayashanti : బీజేపీకి విజయశాంతి రాజీనామా..

Vijayashanti

Vijayashanti

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు బీజేపీకి మరో షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సహా పార్టీకి రాజీనామా చేసిన నేతల జాబితాలో ఆమె చేరారు. కాంగ్రెస్‌ నేతలు విజయశాంతితో ఫోన్‌లో మాట్లాడి కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా సాదరంగా ఆహ్వానించినట్లు సమాచారం. సీనియర్ నేతలు గురువారం ఆమె నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా అధికారికంగా ఆహ్వానం పలుకుతారని టీపీసీసీ కార్యకర్త ఒకరు తెలిపారు. రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version