ఇటీవల బీజేపీ నేత విజయశాంతి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవితపై సానుభూతి తెలిపి అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. దాని నుంచి తేరుకునే లోపే సోనియా గాంధీ అంటే అభిమానమంటూ వెల్లడించి షాకిచ్చారు. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ కవిత అరెస్ట్‌ను తాము కోరుకోవడం లేదని తెలిపారు.ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, కవిత అరెస్ట్ కానంత మాత్రానా.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదన్నారు. అలాగే మొన్న రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీని తెలంగాణ ప్రజలందరం తప్పక అభిమానిస్తామని, రాజకీయాలకు అతీతంగా ఆమెను గౌరవిస్తామని విజయశాంతి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్దిస్తున్నాని, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవిభక్త కవలలు అని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, నిన్న తుక్కుగూడలో రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారని అన్నారు. దీంతో విజయశాంతి బీజేపీని వీడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె క్లారిటీ ఇస్తూ.. ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read : Viral Video : ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటున్న బామ్మ.. నెటిజన్స్ ఫిదా..
‘రాజకీయాలలో ఒక పార్టీల ఉన్నప్పటికీ… ప్రజాస్వామ్య పంథాలో ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా గౌరవించటం నాటి వాజ్‌పేయి జీ, పివి నరసింహారావు గారి నుండి నేటి వరకు కొనసాగుతున్నది. రాజ్యసభ సభ్యులుగా గులాం నబీ ఆజాద్ గారి విరమణ సందర్భంగా… మోడీ గారు కూడా ఆ విధానాన్ని ఆ గౌరవాన్ని పార్టీలకు అతీతంగా కొనసాగించిన సంస్కారం ఆ పెద్దలు మాకు నేర్పిన సంస్కృతి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గారిపై రాజకీయాలకు అతీతంగా నా ప్రకటన కూడా ఆ సంస్కారం నేర్పిన విధానమే… ఆ ప్రకటన పై కూడా విమర్శలు మీడియాల చేయించేవాళ్లు ఎప్పుడు ఉంటారు. వారికి సమాధానం చెప్పడం అంత అవసరం కాదు. జై శ్రీరామ్…
హర హర మహాదేవ.. జై తెలంగాణ..’ అంటూ ట్వీట్ చేశారు విజయశాంతి.
Also Read : Nallala Odelu : బాల్క సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నాం
ఇదిలా ఉంటే.. అంతకుముందు మరోట్వీట్‌లో ‘చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇయ్యడానికి నేను వ్యతిరేకిని. మా పార్టీలోని నేతలు పనిగట్టుకుని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారం తప్పక ఖండంచదగ్గది’ అని విజయశాంతి అన్నారు.