Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Vijayasai Reddy Shocking Announcement New Political Party In July

Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

Published Date :April 24, 2026 , 9:45 pm
By Sudhakar Ravula
Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijayasai Reddy: హైదరాబాద్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఉదయం నుంచి హైదరాబాద్‌లో పది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, విజయసాయిరెడ్డి ఇంటితో పాటు పలువురు అనుబంధ వ్యక్తుల ఇళ్లలో కూడా దర్యాప్తు కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో భారీ స్థాయిలో హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించినట్లు సమాచారం.

Read Also: Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్‌లతో సూపర్ టేస్ట్ రెసిపీ!

Also Read

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్‌లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
  • Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..

ఇక, చంద్రబాబు కావాలనే తనను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి, తనపై రాజకీయ కక్షతో ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంట్లో ఎలాంటి అక్రమాలు బయటపడలేదని, ఏమీ లభ్యం కాలేదని చెప్పారు. ఇంట్లో ఉన్న రూ.6 లక్షలు తమ తల్లి ఆసుపత్రి ఖర్చుల కోసం ఉంచినవేనని స్పష్టం చేశారు.

ఈడీ సోదాలు చేయాల్సింది అక్కడే..
ఈడీ అధికారులు తన ఇంట్లో కాకుండా చంద్రబాబు ఇంట్లో సోదాలు చేయాలని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, జీవిత చరమాంకంలో అయినా మంచి పనులు చేయాలని సూచించారు. ప్రజలు అన్నింటినీ గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు.

జులైలో కొత్త పార్టీ ప్రకటిస్తా
రాజకీయాలకు దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు. అంతేకాదు.. రాజకీయాలతో పాటు మీడియా రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను ప్రజలకు వెల్లడించేలా మీడియా వేదికను ఉపయోగిస్తానని చెప్పారు. అయితే, విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన, మీడియా రంగ ప్రవేశం, చంద్రబాబుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జులైలో ఆయన ప్రకటించబోయే పార్టీ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు చేరతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • AP latest politics
  • Chandrababu Vijayasai Reddy news
  • Telugu Political News
  • Vijayasai Reddy ED raids

తాజావార్తలు

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

  • Katte Pongali Recipe: గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టె పొంగలి.. ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే అమృతంలా!

  • Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions