Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్‌లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kulfi Recipe at Home: వేసవి కాలం వచ్చిందంటే చల్లని పదార్థాలపై అందరికీ మక్కువ పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసే స్ట్రీట్-స్టైల్ కుల్ఫీకి ప్రత్యేక స్థానం ఉంది. వీధిలో “కుల్ఫీ వాలా…” అంటూ వినిపించే శబ్దం వినగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా కొనేవారు. ఇప్పుడు అదే క్రీమీ, రుచికరమైన కుల్ఫీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ రెసిపీకి మావా, కండెన్స్డ్ మిల్క్, మిల్క్ పౌడర్ అవసరం లేదు. గంటల తరబడి పాలను మరిగించాల్సిన పని కూడా లేదు. కేవలం రస్క్‌లు ఉపయోగించి కుల్ఫీకి కావాల్సిన క్రీమీ టెక్స్చర్ తీసుకురావచ్చు.
ఈ రెసిపీ స్పెషల్ ఏంటి?
సాధారణంగా కుల్ఫీ చేయాలంటే పాలను చిక్కబరచాలి. కానీ ఈ రెసిపీలో రస్క్‌లు పాలలో కరిగి రబ్రీ లాంటి గట్టిదనాన్ని ఇస్తాయి. దీంతో తక్కువ సమయంలోనే మలై కుల్ఫీ లాంటి రుచి వస్తుంది.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
కావాల్సిన పదార్థాలు
* 1 లీటర్ పాలు
* 7 నుంచి 8 రస్క్‌లు
* 7 నుంచి 8 జీడిపప్పులు
* అర కప్పు బెల్లం లేదా బెల్లం పొడి
* అర టీస్పూన్ యాలకుల పొడి
* 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు పాల మీగడ (ఐచ్ఛికం)
* కొద్దిగా కుంకుమపువ్వు
* పిస్తా, బాదం ముక్కలు
* ఐస్ క్యూబ్స్
* కొద్దిగా ఉప్పు
తయారీ విధానం
ముందుగా ఒక పాత్రలో పాలను వేసి మధ్యస్థ మంటపై రెండు సార్లు మరిగించాలి. తర్వాత అందులో రస్క్‌లు వేసి అవి పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత జీడిపప్పులు వేసి మంట ఆపేయాలి. పాలు కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం కలపాలి. వేడి పాలలో బెల్లం వేయకూడదు. బెల్లం కరిగిన తర్వాత యాలకుల పొడి, కుంకుమపువ్వు, పిస్తా, బాదం వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. పాల మీగడ వేసి మరోసారి బ్లెండ్ చేస్తే మరింత క్రీమీగా ఉంటుంది.
ఫ్రీజ్ చేయడం ఎలా?
తయారైన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లలో లేదా చిన్న గ్లాసుల్లో పోయాలి. పైభాగాన్ని ఫాయిల్ లేదా బటర్ పేపర్‌తో కప్పాలి. ఒక గంట తర్వాత స్టిక్స్ పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. త్వరగా గడ్డకట్టాలంటే ఐస్ క్యూబ్స్, ఉప్పు ఉన్న పాత్రలో మౌల్డ్‌లను పెట్టవచ్చు.
ఎప్పుడు రెడీ అవుతుంది?
సుమారు 7 నుంచి 8 గంటల తర్వాత కుల్ఫీ బాగా గట్టిపడుతుంది. మౌల్డ్‌ను కొద్దిసేపు నీటిలో ముంచి బయటకు తీస్తే సులభంగా వస్తుంది. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే స్ట్రీట్-స్టైల్ క్రీమీ కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు, పెద్దలకు ఈ వేసవిలో ఇది బెస్ట్ ట్రీట్ అవుతుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!