Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: ఈ నెల 11 తేదీన పార్టీ ఆవిర్భావానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన నేతలు మా పార్టీలోకి వస్తున్నారన్నారు. విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సుమతి రెడ్డి, దళిత సంఘాల నేత బోణి గణేష్ తమ పార్టీలో చేరుతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రాన్ని రెండు కుటుంబాల చేతుల్లోనే పెట్టకూడదన్నారు. యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిరంకుశత్వ పాలక లేకుండా తమ పార్టీ ఉంటుందని చెప్పారు. రాబోయే చాలా మంది పార్టీలోని రాబోతున్నారని వివరించారు.

రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం తమ పార్టేనన్నారు. స్థానిక ఎన్నికల్లో ఆరు ఉమ్మడి జిల్లాలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. జగన్ ని వదిలి వెళ్లిపోతానని కలలో కూడా అనుకోలేదని.. కోటరీ ఉచ్చులో జగన్ చిక్కునుని నొప్పించే విధంగా వ్యవహరించారన్నారు. భరించలేని విధంగా నన్ను అవమానించారు. బలవంతంగా పార్టీ నుంచి నన్ను బయటికి తోసేశారు. 70 అవమానాలు పడి భరించి.. భరించి బయటికి వచ్చేయాల్సి వస్తుంది. చెప్పుడు మాటలు విని జగన్ నన్ను కొన్ని బాధ కలిగించేలా చేశారు. వైయస్సార్, రాజారెడ్డి ఏనాడు నన్ను పల్లెత్తు మాట అనలేదని విజయసాయిరెడ్డి తెలిపారు.