Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: రాజకీయాల్లోకి వచ్చుడు పక్కా.. త్వరలోనే పార్టీని ప్రకటిస్తానని చెబుతున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తిరుపతి వేదికగా పలు కీలక ప్రతిపాదనలు, వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలో ఇప్పటికే 15 ప్రతిపాదనలు ప్రకటించామని, తాజాగా తిరుపతిలో మరో ఐదు ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తానని, తమ పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నానని చెప్పారు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తామని స్పష్టం చేశారు. మతాన్ని, కులాన్ని రాజకీయాలకు ఉపయోగించకూడదని విజయసాయి రెడ్డి అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మతాన్ని రాజకీయాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కుల వివక్షను విడిచిపెట్టాలని, హిందూ దళితులను ఆలయాల్లోకి అనుమతించకపోతే నాలుగేళ్ల జైలు శిక్ష పడేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జగన్ కుల, మతాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు.
ఇక, జగన్ క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి రావాలని, అలా వస్తే స్వాగతిస్తామని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ‘రెడ్డి’ పేరును రాజకీయాలకు, ఓట్ల కోసం ఉపయోగించుకోవద్దని అన్నారు. మతమార్పిడుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏపీలో హిందువులు మతాలు మారే పరిస్థితి ఏర్పడుతోందని, రాష్ట్రంలో సుమారు 8 వేల చర్చిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఎలినో ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సాయిరెడ్డి. SIR ప్రక్రియకు తాను మద్దతు ఇస్తున్నానని, దానిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళన సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ‘ఇండియన్ ఇర్రేషనల్ పార్టీ’గా అభివర్ణించారు. రాయలసీమ మరోసారి కరువు సీమగా మారే అవకాశం ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
Also Read
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
తిరుపతికి సంబంధించి మరికొన్ని కీలక ప్రతిపాదనలను కూడా విజయసాయి రెడ్డి వెల్లడించారు. తిరుపతిలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని, ప్రపంచ హిందూ ధార్మిక సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీటీడీ బోర్డును రద్దు చేసి రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా చేయాలని ప్రతిపాదించారు. మఠాధిపతులు, పీఠాధిపతులకు టీటీడీలో ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. ఏడుకొండలను టీటీడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తిరుమల భద్రతపై కూడా విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల భద్రతను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. తిరుపతిలో ఉన్న క్రిస్టియన్ మిషనరీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. వెంకటేశ్వర పాఠశాలలను ఏర్పాటు చేసి ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు.
టీటీడీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రక్షాళన చేసిందని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.. పరకామణి వ్యవహారంలో సాక్షి చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. శ్రీవారి లడ్డూలో ఇప్పటికీ కల్తీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో లడ్డూలో లోపభూయిష్టమైన నెయ్యి కలిసిన విషయం వాస్తవమేనని, అయితే జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారు. లడ్డూ వ్యవహారాన్ని చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. జగన్ క్రిస్టియానిటీని, చంద్రబాబు హిందుత్వాన్ని రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి..
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!