VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VijayaSai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పండుగ తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు పరివర్తన రాజనీతి పార్టీ (PRP) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, వారి ఇబ్బందులను నేరుగా అర్థం చేసుకోవడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ గ్రామాలకు వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటిపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్సీపీలపై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రెండు కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందని, దీనివల్ల నిజమైన ప్రజా ప్రాతినిధ్యం అణచివేతకు గురవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కక్షపూరిత రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, కేవలం రాజకీయాలను చూస్తూ ఉండకుండా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ప్రవేశించాలని విజయసాయి రెడ్డి సూచించారు. యువత చట్టసభల్లో సభ్యులుగా ఎన్నికై ప్రజల గొంతుకను వినిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సామాజిక, రాజకీయ మార్పు తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు పరివర్తన రాజనీతి పార్టీ (PRP) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయసాయి రెడ్డి.
Also Read
- Off The Record: 'ఎవర్రా వీళ్లంతా..?' అంటూ జనసైనికుల ఫైర్
- Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
- Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
- CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
-
Vrushakarma Trailer: ‘వృషకర్మ’లో పాటలు, లవ్ స్టోరీ లేవు.. కానీ 2 గంటల 40 నిమిషాలు ఊపిరి బిగపట్టాల్సిందే!
-
OTR: ఆ మంత్రి పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉందా?
-
OTR: ‘నశా ముక్త్ భారత్’ వెనుక కేంద్ర మంత్రి అసలు ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ‘ఎవర్రా వీళ్లంతా..?’ అంటూ జనసైనికుల ఫైర్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!