Vijay Sethupathi-Fan: అభిమాని ఇంట్లో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sethupathi Meets Fan in Madurai: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర నచ్చితే చాలు.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తమిళ్ సినిమాలతో పాటు తెలుగు, హిందీలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సహజ నటనతో ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు కూడా ఆయన ఎంతో విలువిస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌కు చెందిన జయబాస్, జయపాల్ సోదరులు విజయ్ సేతుపతికి పెద్ద అభిమానులు. ఇద్దరిలో ఒకరు జిల్లా అభిమాన సంఘానికి అధ్యక్షుడు కాగా.. మరోకరు జిల్లా ఉప కార్యదర్శి. మే 2న జయబాస్, జయపాల్‌లు తమకు నచ్చిన యువతులను వివాహం చేసుకున్నారు. తమ పెళ్లికి రావాలని వీరు విజయ్ సేతుపతిని కోరారు. అయితే ఆ రోజు సినిమా షూటింగ్ ఉండటంతో.. పెళ్లికి హాజరు కాలేకపోయారు. దాంతో మక్కల్ సెల్వన్ నేడు తన అభిమానుల ఇంటికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
Also Read: Allu Arjun vs Keerthy Suresh: అల్లు అర్జున్‌కు పోటిగా కీర్తి సురేష్!
విజయ్ సేతుపతి నటించిన తాజా సినిమా ‘మహారాజా’ ట్రైలర్ నేడు విడుదలైంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా వస్తుండటంతో.. ఆయన ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిథిలన్ సామినాథన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ ప్రస్తుతం మహారాజా, ట్రైన్, ఏస్ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో జవాన్, కత్రినా కైఫ్‌తో మెర్రీ క్రిస్మస్ చిత్రాల్లో నటించాడు.
తాజావార్తలు
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!