NTV Telugu Site icon

Baba Indrajith: ఏంటి భయ్యా మూతికి ప్లాస్టర్ వేసుకుని బ్యాటింగ్ చేశావ్..

Baba Indrajith

Baba Indrajith

Vijay Hazare Trophy: సాధారణంగా టీమ్ క‌ష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు కొంద‌రు ప్లేయర్స్ గాయాల‌ను సైతం పట్టించుకోకుండా క్రీజులోకి వస్తుంటారు.. కాలికి లేదా చేతికి లేదంటే త‌ల‌కు గాయ‌మైన స‌రే బ్యాటింగ్ కు వచ్చే ప్లేయర్స్ ను చూశాం.. కానీ, మూతికి తీవ్ర గాయమైనప్పటికి ప్లాస్టర్ వేసుకుని వచ్చిన ఓ ప్లేయర్ తన బ్యాటింగ్ తో టీమ్ ను గెలిపించేందుకు అద్భుతమైన పోరాటం చేశాడు. టీమ్ కోసం అత‌డు చేసిన పోరాటానికి నెట్టింట ప్రసంశలు కురిపిస్తున్నారు.

Read Also: Animal : యానిమల్ ఓటీటీ వెర్షన్ లో ఆ డిలీటెడ్ కిస్ సీన్ యాడ్ చేయనున్న మేకర్స్..?

అయితే, విజ‌య్ హ‌జారే ట్రోఫీలో భాగంగా సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో నిన్న ( బుధ‌వారం) హ‌ర్యానా, త‌మిళ‌నాడు టీమ్స్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ‌ర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 రన్స్ చేసింది. హ‌ర్షిత్ రాణా సెంచ‌రీ చేయ‌గా యువ‌రాజ్ సింగ్ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఆ తర్వాత భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు త‌మిళ‌నాడు టీమ్ బ‌రిలోకి దిగింది. ఇక, 14వ ఓవ‌ర్‌లో 53 రన్స్ దగ్గర మూడో వికెట్ పడిపోయింది. ఈ సమయంలో భీక‌ర ఫామ్‌లో ఉన్న బాబా ఇంద్రజిత్ మూతికి ప్లాస్టర్ వేసుకుని బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే, అతడు గ‌త రెండు ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌పై 92, ముంబైపై శతకంతో రెచ్చిపోయాడు. 29 ఏళ్ల ఇంద్రజిత్‌ 10 బాల్స్ ఎదుర్కొన్న తర్వాత ఇబ్బంది పడ్డాడు. వెంట‌నే ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చి చికిత్స ఇచ్చిన తర్వాత కాస్త కోలుకున్న ఇంద్రజిత్ టీమ్ కోసం నొప్పిని భ‌రిస్తూ చాలా సేపు బ్యాటింగ్ చేశాడు. ఇంద్రజిత్ 71 బంతుల్లో 64 రన్స్ చేయగా అందులో 5 ఫోర్లు ఉన్నాయి.

Read Also: Balakrishna : వామ్మో.. బాలకృష్ణ ఒక్కో యాడ్ కు అన్ని కోట్లు తీసుకుంటారా?

కాగా.. ఇంద్రజిత్ పోరాడిన‌ప్పటికీ మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో త‌మిళ‌నాడు లక్ష్య ఛేద‌న‌లో 230 రన్స్ కు ఆలౌటైంది. దీంతో 64 ప‌రుగుల తేడాతో హర్యానా విజయం సాధించింది. త‌మిళ‌నాడు జ‌ట్టులో బాబా ఇంద్రజితే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక, ఇన్నింగ్స్ విరామ స‌మ‌యంలో అత‌డు గాయ‌ప‌డిన‌ట్లు సమాచారం. బాత్రూమ్‌లో కాలు జారి కింద‌ప‌డ‌డంతో అత‌డి పెద‌వికి తీవ్ర గాయమైందని టాక్. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంద్రజిత్ ను హస్పటల్ కు తీసుకువెళ్లాగా.. అతనికి కుట్లు ప‌డిన‌ట్లు త‌మిళ‌నాడు జట్టు కెప్టెన్ దినేష్ కార్తిక్ వెల్లడించారు.