డిసెంబర్ 1 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన యానిమల్ మూవీ భారీగా వసూళ్లు సాధిస్తూ రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది.అయితే సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. యానిమల్ మూవీ 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.755 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ మూవీ వసూళ్లు రూ.467.85 కోట్లుగా ఉన్నాయి.అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14 లేదా 15 తేదీల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.అంతేకాదు థియేటర్లలో డిలీట్ చేసిన ఓ సీన్ ను కూడా ఓటీటీలో చేర్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ పాత్రకు, తన పాత్రకు మధ్య సినిమాలో ఉన్న బంధం గురించి తెలిపారు.
ప్రేమ, ద్వేషం కలగలసిన బంధమది. దీని గురించి చెబుతూ క్లైమ్యాక్స్ ఫైట్ సీన్ ఎలా జరిగిందో వివరించారు.”ఈ ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపాలని అనుకుంటారు. కానీ వాళ్ల మధ్య ప్రేమ కూడా ఉంది. అందుకే క్లైమ్యాక్స్ ఫైట్ లో బ్యాక్‌గ్రౌండ్ లో ప్రేమ గురించిన పాట వస్తుంటే వీళ్లు కొట్టుకుంటూ ఉంటారు” అని బాబీ తెలిపారు.క్లైమ్యాక్స్ లో బీ ప్రాక్ పాడిన దునియా జలా దేంగే అనే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. నిజానికి తమ పాత్రల మధ్య ఓ కిస్ సీన్ కూడా ఉందని బాబీ వెల్లడించారు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆ సీన్ తనకు ఎలా వివరించాడో బాబీ తెలిపారు.”మీరు ఫైట్ చేస్తూ ఉంటారు.. నువ్వు సడెన్ గా కిస్ చేస్తావు. అయినా వదిలి పెట్టవు. అతడు నిన్ను చంపేస్తాడు అని సందీప్ చెప్పాడు. ఇద్దరి మధ్య ఓ కిస్ ఉంది. కానీ అతడు ఆ సీన్ ను డిలీట్ చేశాడు. బహుశా ఆ సీన్ నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ లో చూడొచ్చు” అని బాబీ డియోల్ తెలిపారు.