NTV Telugu Site icon

Allu Arjun: మై స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు ధన్యవాదాలు!

Allu Arjun Vijay Deverakonda

Allu Arjun Vijay Deverakonda

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ నటించిన తాజా చిత్రం ‘పుష్ప-ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో అల్లు అర్జున్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి.. దేశంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్న ఈవెంట్స్‌లో బన్నీ పాల్గొంటున్నారు. పట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తి చేసిన అల్లు అర్జున్‌.. నేడు ముంబైలో ప్రెస్‌ మీట్‌కు హాజరుకానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 30న చిత్తూరులో భారీ ఎత్తున ప్లాన్ చేశారు.

Also Read: Champions Trophy 2025: ఐసీసీ కోర్టులో బంతి.. నేడు తేలనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ భవితవ్యం!

పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు హీరో విజయ్‌ దేవరకొండ ఓ కానుక పంపారు. తన రౌడీ బ్రాండ్‌ కలెక్షన్స్‌ నుంచి పుష్ప పేరుతో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన టీ షర్ట్‌లను పంపారు. ఈ విషయని బన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులలతో పంచుకున్నారు. ‘నా స్వీట్‌ బ్రదర్‌ విజయ్.. నీ ప్రేమకు ధన్యవాదాలు’ అని అల్లు అర్జున్‌ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు విజయ్ పంపిన టీ షర్ట్‌ల ఫోటోను జత చేశారు. ఈ పోస్టుకు విజయ్ రిప్లే ఇస్తూ.. ‘లవ్‌ యూ అన్నా.. మన సంప్రదాయాలు ఎప్పటికీ ఇలానే కొనసాగుతాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. రౌడీ బ్రాండ్‌ కలెక్షన్స్‌ నుంచి విజయ్‌ ఇప్పటికే పలు డ్రెస్సులను అల్లు అర్జున్‌కు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప ప్రచారంలో బిజీగా ఉండగా.. VD 12 షూటింట్‌లో విజయ్ ఉన్నారు.

Show comments