Site icon NTV Telugu

Rowdy Janardhana: “రౌడీ జనార్దన”లో ఆ స్టార్ హీరోయిన్ ?

Roudi Janardhan, Shobana

Roudi Janardhan, Shobana

రౌడి హీరో విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో వస్తున్న ‘రౌడీ జనార్దన’. తాజాగా విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చిత్రంపై అంచనాలు పెంచేసింది. గ్రామీణ నేపథ్యం ఉన్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Also Read : Rishab Shetty: పారితోషికం విషయంలో ససేమిరా అంటున్న రిషబ్ శెట్టి .. టాలీవుడ్ నిర్మాతల డైలమా!

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో హీరోకి తల్లిగా ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. దాదాపు దశాబ్దం తర్వాత ఆమె కల్కి మూవీతో తెలుగు తెరపై కనిపించగా, ఇప్పుడు విజయ్ మూవీలో కూడా భాగం కాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే, ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్నారని, ఆయన లుక్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోందని సమాచారం. విజయ్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో భారీ తారాగణం ఉండటం చూస్తుంటే, విజయ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద పక్కా మాస్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

Exit mobile version