రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజైన ఈ మూవీ గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నిన్న సోమవారం సాయంత్రం టీజర్ ను లాంచ్ చేసారు. ఇందులో రౌడీ బాయ్ ని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించారు. అయితే టీజర్ లో విజయ్ దేవరకొండ ప్రీమియం బ్రాండ్ చెప్పులు వేసుకొని కనిపించడంపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.’ఫ్యామిలీ స్టార్’ టీజర్ లో విజయ్ దేవరకొండ కొన్ని సన్నివేశాల్లో తన కాళ్ళకు క్రాక్స్ బ్రాండెడ్ ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని ఉన్నాడు. క్రాక్స్ ఎలాంటి ఫుట్ వేర్ బ్రాండ్ అనేది నేటి యూత్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ కంపెనీలో నార్మల్ గా రూ. 1500 – 7000 రేంజ్ లో ఫ్లిప్ ఫ్లాప్స్ దొరుకుతాయి. మహేశ్ బాబు, రామ్ వంటి సెలబ్రిటీలు కూడా తమ ఇళ్లల్లో ఇదే బ్రాండ్ స్లిప్పర్స్ తో తిరుగుతూ కనిపిస్తారు.
ఇప్పుడు విజయ్ కూడా తన కొత్త సినిమాలో అలాంటి క్రాక్స్ వేసుకునే కనిపించారు. వీటి ధర 2 వేల రూపాయలకుపైగానే ఉంటుంది.అయితే సినిమాలో హీరోని మిడిల్ క్లాస్ అబ్బాయిగా పరిచయం చేస్తూ, ప్రీమియం బ్రాండ్ స్లిప్పర్స్ వేసుకోవడంపై ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. “క్రాక్స్ వేసుకొని మిడిల్ క్లాస్ అంట. సూపర్ అన్నా” అని వ్యగ్యంగా కామెంట్ చేసాడు. దీనికి విజయ్ దేవరకొండ స్పందించారు. “సేల్ లో కొన్నాను. 70% ఆఫర్ లో” అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ బాగా అవుతోంది. దీనికి కొందరి నెటిజన్ల నుంచి విజయ్ కు మద్దతు లభిస్తోంది. మిడిల్ క్లాస్ వాళ్ళు 2 వేల రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కోకూడదా..అని ఒకరు కామెంట్ చేస్తే.. ఈరోజుల్లో క్రాక్స్ ధరిస్తే డబ్బున్న వాడని అనుకోవడం పొరపాటు అని ఇంకొకరు కామెంట్ చేసారు.. హీరోని మిడిల్ క్లాస్ మ్యాన్ గా ప్రెజెంట్ చేయడానికి పాత సినిమాల్లో మాదిరిగా పారాగాన్ స్లిప్పర్స్ తో చూపించాలా ఏంటి.. అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
Sale lo konna!
70% off lo.— Vijay Deverakonda (@TheDeverakonda) March 4, 2024