Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురైన వార్తతో ఆందోళన చెందిన అభిమానులకు, హీరో స్వయంగా గుడ్ న్యూస్ తెలిపాడు. తాను, తన బృందం సురక్షితంగా ఉన్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో తన కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ తాము క్షేమంగా ఉన్నామని విజయ్ దేవరకొండ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. విజయ్.. అంతా బాగానే ఉంది. కారు డ్యామేజ్ అయ్యింది.. కానీ, మేమంతా క్షేమంగా ఉన్నాం.. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తాను వర్కౌట్ (Strength Workout) చేసి ఇప్పుడే ఇంటికి చేరుకున్నానని తెలిపారు. నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది.. కానీ ఒక మంచి బిర్యానీ తిని నిద్రపోతే సరిగ్గా అయిపోతుందని.. అభిమానులందరికీ నా బిగ్గెస్ట్ హగ్స్, ప్రేమ అంటూ ఈ వార్త మీకు బాధ కలిగించకూడదని రాసుకొచ్చాడు.
Keonjhar:దారుణం.. కుటుంబ కలహాలతో.. సవతి తండ్రి హత్య
ఇకపోతే, కారు సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం సమీపంలో చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ తన మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్‌తో కలిసి నేడు ఉదయం పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై వరసిద్ధి పత్తి మిల్లు దగ్గర ఒక బస్సు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, విజయ్ దేవరకొండ కారు ముందున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, హీరోతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విజయ్ దేవరకొండ సురక్షితంగా ఇంటికి చేరినట్లు స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. Oppo K13x 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్