ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. Oppo K13x 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo K13x 5G: మొబైల్ మార్కెట్లో పోటీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో (Oppo) తన కొత్త బడ్జెట్ ఫోన్ Oppo K13x 5G పై మరింత డిస్కౌంట్ ను అందించింది. తక్కువ ధరలో మంచి పనితీరు, భారీ బ్యాటరీ లైఫ్, 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. సాధారణ రోజువారీ వాడకానికి సౌకర్యంగా ఉండే విధంగా రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్, మధ్యస్థాయి సెగ్మెంట్‌లోని పాపులర్ మోడల్స్‌కి సవాల్ విసురుతోంది.
Oppo K13x 5G ఫోన్‌లో Mediatek Dimensity 6300 చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది 2.4GHz క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా యాప్‌లు, లైట్ గేమింగ్ వంటి వాటిని సాఫీగా నిర్వహిస్తుంది. ఇందులో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందించబడింది. అదనంగా మెమరీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. DC డిమ్మింగ్, ఐ కంఫర్ట్ మోడ్, సన్ లైట్ స్క్రీన్ వంటి ఫీచర్లు దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంటాయి.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
Viral News: ఇదో గమ్మత్తు తతంగం.. కట్నం వద్దన్న కాబోయే అల్లుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన మామ
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, 6000mAh సామర్థ్యంతో కూడిన భారీ బ్యాటరీ ఫోన్‌లో ఇవ్వబడింది. ఇది సింగిల్ చార్జ్‌పై సులభంగా ఒక రోజు మొత్తం పనిచేస్తుంది. అలాగే, 45W SUPERVOOC ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ ద్వారా ఫోన్ వేగంగా చార్జ్ అవుతుంది. ఇక ఈ Oppo K13x 5G లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ లెన్స్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా మంచి డిటైల్స్‌తో ఫోటోలు అందించగా, 2MP సెన్సార్ పోర్ట్రెయిట్ ఫోటోల నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది 1080p వీడియో రికార్డింగ్ @ 60fps ను సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాగా 8MP సెల్ఫీ కెమెరా అందించబడింది.
గత నెలలో Oppo K13x 5G ధర 8% మేర తగ్గింది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ.10,543కే లభిస్తుంది. ఇది లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు మూడు వేల మేర ధర తగ్గింది. కాబట్టి ఈ మొబైల్ ప్రస్తుతం కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. మొత్తం మీద Oppo K13x 5G బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్నవారికి సరైన ఎంపిక. భారీ బ్యాటరీ, స్నాపీ ప్రాసెసర్, 5G కనెక్టివిటీతో పాటు, సన్నని డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లతో ఇది ఆకర్షణీయమైన ప్యాకేజీగా మారింది. రూ.12,000 లోపు విశ్వసనీయమైన, శక్తివంతమైన ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.
BIS Care App: ఈ మొబైల్ యాప్ తో ఇంట్లో కూర్చొని.. నకిలీ బంగారు ఆభరణాలను గుర్తించొచ్చు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..