Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda: ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మొదటి సక్సెస్‌ను అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో చేసిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత చేసిన ‘గీత గోవిందం’ మూవీతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. నిజానికి ఈ మూవీ తర్వాత విజయ్‌కి సరైన సక్సెస్ రావడం లేదు. రీసెంట్గా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చేసిన ‘రణబాలి’ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు. ప్రస్తుతం తెలుగులో ఆరుగురు మాత్రమే టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. మరికొంత మంది టైర్ వన్ హీరోల లిస్టులోకి చేరాలనే ప్రయత్నం చేసినప్పటికీ అది వర్కౌట్ కావడం లేదు. విజయ్ దేవరకొండ గత కొన్ని సంవత్సరాలుగా ఒక్క భారీ హిట్ కొట్టి టైర్ వన్ హీరోల లిస్ట్‌లోకి చేరాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, ఆ హిట్ కొట్టలేకపోతున్నాడు. గత ఏడాది ‘కింగ్ డమ్’ మూవీతో సత్తా చాటాలనుకున్నాడు. కానీ, ఆ మూవీ ప్రేక్షకులకు నచ్చలేదు. కథలోనే లాజిక్స్ మిస్ అవ్వడం, స్క్రీన్ ప్లే రొటీన్ టెంప్లేట్లో ఉండటం, నేరేషన్ స్లో అవ్వడంతో సినిమా పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. అలానే రణబాలి సినిమా కూడా బానే ఆడింది కానీ ఎక్కడో వెలితి.
ఇప్పుడు రాజ్ కిరణ్ కోలా డైరెక్షన్లో చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ భారీ విజయాన్ని అందుకుంటే విజయ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతాడు. లేకపోతే ఆయన మీడియం రేంజ్ హీరోగానే మిగిలే అవకాశం ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లో, ముఖ్యంగా ‘లైగర్’ సినిమా సమయంలో విజయ్ మాట్లాడిన మాటలు స్టార్ హీరోల అభిమానులను ఇబ్బంది పెట్టాయి. “మా తాత ఎవరో తెలీదు, మా నాన్న ఎవరో తెలియదు.. అయినా కూడా నాకోసం ఇంత మంది వచ్చారు” అంటూ ఆయన చేసిన కామెంట్స్ స్టార్ హీరోల అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులకు సైతం కొంచెం ఓవర్‌గా అనిపించడంతో, ఆయన కొంతమంది అభిమానులను కోల్పోయాడు. కానీ, ఈ మధ్య చాలా పద్ధతిగా ఉంటూ తన గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. మొత్తానికైతే మరో భారీ సక్సెస్ కొట్టి గ్రాండ్‌గా టైర్ వన్ హీరోల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Also Read
- Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
- Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
- AP Assembly Winter Session: డిసెంబర్ 5 నుంచి శీతాకాల సమావేశాలు.. పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై చర్చ!
- Nidadavole Municipality: నిడదవోలు వైస్ చైర్మన్ పదవిపై ముదురుతున్న వివాదం.. కూటమిలో కలకలం!
తాజావార్తలు
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
AP Assembly Winter Session: డిసెంబర్ 5 నుంచి శీతాకాల సమావేశాలు.. పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై చర్చ!
-
Nidadavole Municipality: నిడదవోలు వైస్ చైర్మన్ పదవిపై ముదురుతున్న వివాదం.. కూటమిలో కలకలం!
ట్రెండింగ్
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!