సినీ ఇండస్ట్రీ ఇద్దరు హీరోలు కలిసి ఒక స్టేజ్ పై కనిపిస్తే ఇద్దరి ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఇక ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.. ఇక స్టేజ్ పై స్టెప్పులేస్తే అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా తమిళ హీరో కార్తీ, విజయ్ దేవరకొండ కలిసి ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేశారు. నిన్న రాత్రి చెన్నైలో గలాటా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది..
ఈ ఈవెంట్ కు తెలుగు, తమిళ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్స్ హాజరయ్యారు.. హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ వేడుకకు విచ్చేసారు.. స్టేజిపై కార్తీకి అవార్డు అందించడానికి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వచ్చారు.. కార్తీ కోరడంతో విజయ్ కూడా స్టేజ్ పై స్టెప్పులు వేశారు. అందుకు సంబందించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది..
కార్తీ, విజయ్ అభిమానులు తమ హీరోలు ఇలా స్టేజిపై డ్యాన్స్ వేస్తుంటే సంతోషంగా ఉందంటూ వీడియోను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వేడుకకు సంబందించిన వీడియోలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. కార్తీ కూడా తమిళ్లో వరుస సినిమాలు చేస్తున్నాడు..