ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’.’కలర్ ఫోటో’ వంటి నేషనల్ అవార్డు ని అందుకున్న సినిమాకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూలై 14 న థియేటర్స్ లో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది..ఈ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్, బాగా నచ్చడంతో సినిమా పై ప్రేక్షకులకు ఆసక్తి కలిగింది.ఈ సినిమా అనుకున్న విధంగా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.అలాగే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ సంతోషం గా వున్నారు.. తమ్ముడు ఆనంద్ కి అలాగే హీరోయిన్ వైష్ణవికి టైట్ హగ్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ఈ సినిమాలో నిజ జీవితంలో స్కూల్ మరియు కాలేజ్ డేస్ లో జరిగే లవ్ స్టోరీని కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు సాయి రాజేష్..
ఈ సినిమా యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది.ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి కొన్ని వార్తలు వచ్చాయి. ‘బేబీ’ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు అయినట్లు సమాచారం.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ రూ.8 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.మూవీ రిలీజ్ కి ముందే ఈ డీల్ జరిగినట్లు సమాచారం. ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఎంతో ఆసక్తికరంగా మారింది. విడుదలకు ముందే ఈ సినిమా భారీగా లాభాలు అందుకుంది.ఇక సెప్టెంబర్ నెలలో ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.