Site icon NTV Telugu

Dulquer Salmaan :విజయ్ దేవరకొండ అన్న ‘DQ’!

Sita Ramam

Sita Ramam

Vijay Devarakonda Brother ‘DQ’!
యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఓ తమ్ముడున్నాడు మనకు తెలుసు. అతని పేరు ఆనంద్ దేవరకొండ. కానీ, విజయ్ కు ‘డి.క్యూ.’ అనే అన్న కూడా ఉన్నాడు. అతనెవరంటారా? మళయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. విజయ్, దుల్కర్ ను ముద్దుగా ‘డిక్యూ అన్న’ అని పిలుచుకుంటాడు. వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే! అప్పటి నుంచే దుల్కర్, విజయ్ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. తన అన్న ‘డిక్యూ’ హీరోగా నటించిన తెలుగు సినిమా ‘సీతారామం’ను పెద్ద హిట్ చేయాలని తెలుగు ప్రేక్షకులను కోరాడు విజయ్.

తన అన్న ‘డిక్యూ’ ఎప్పుడూ తనకు మోరల్ సపోర్ట్ ఇస్తూనే ఉంటాడని విజయ్ చెప్పాడు. తాను హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ మళయాళం వర్షన్ లో ఆంథెమ్ సాంగ్ ను పాడమని కోరగానే, అలా అడగ్గానే ఇలా పాడేశాడు డిక్యూ అన్న అని గుర్తు చేసుకున్నాడు విజయ్. మరి అన్నేమో ‘సీతారామం’గా ఆగస్టు 5న జనం ముందుకు వస్తున్నాడు. తమ్ముడు ‘లైగర్’గా ఆగస్టు 25న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ అన్నదమ్ముల్లో ఎవరు ఏ స్థాయి విజయం సాధిస్తారో చూడాలి.

Exit mobile version