Site icon NTV Telugu

Bichagadu 2 : సోషల్ మీడియాలో ‘బిచ్చగాడు 2’ హల్ చల్.. అసలేమైంది

Bichagadu2

Bichagadu2

Bichagadu 2 : విజయ్ ఆంటోని ఆరేళ్ల క్రితం నటించిన బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో గుర్తుందా? 2016లో వేసవి కానుకగా విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అందుకుంది. అదే సంవత్సరం నోట్ల రద్దు జరగడం.. ఈ సినిమాలో బిచ్చగాడు.. 500, 1000 నోట్లను రద్దు చేయమని సూచించడం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. నోట్ల రద్దును బిచ్చగాడు ముందుగానే అంచనా వేశాడంటూ మీమ్స్ హల్చల్ చేశాయి. తల్లి ఆరోగ్యం కోసం కొడుకు బిచ్చగాడు మాదిరిగా దీక్ష చేపట్టే ఈ కథ ప్రేక్షకులకు హార్ట్ టచింగ్‌గా అనిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాలని కోరుకున్నారు. ఇప్పటికే ఆ సినిమాను మొదలుపెట్టేశారు కూడా. తాజాగా బిచ్చగాడు-2 గురించి ఆసక్తికర అప్డేట్ చెప్పారు హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు-2 చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్లు విజయ్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Read Also: RRR New Record: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్

ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ కళ్లకు ఎరుపు రంగు గుడ్డ కట్టుకుని ఉంటాడు. దానిపై యాంటీ బికిలీ(Anti Bikili) అని రాసి ఉంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు విజయ్. బిచ్చగాడు 2 డిజిటల్‌, శాటిలైట్ హక్కులకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్ ను స్టార్ నెట్‌వర్క్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్‌. సీక్వెల్ ప్రాజెక్ట్‌ను విజయ్‌ ఆంటోనీయే స్వయంగా డైరెక్ట్‌ చేస్తూ.. సంగీతమందిస్తుండటం విశేషం. కొన్ని నెలల క్రితం విడుదలైన బిచ్చగాడు 2 థీమ్‌ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. బిచ్చగాడు 2లో హరీష్‌ పేరడి, కావ్య థాపర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. 2023 సమ్మర్‌ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=SZ53jYM41do&t=27s&ab_channel=MangoMusic

Exit mobile version