Film Tittle: ఒక్క సినిమా టైటిల్ కోసం రూ.112 కోట్లు.. బాబోయ్ అంత డిమాండ్ ఉందా..?
దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) టైటిల్ మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఇటీవల విడుదలైంది.
రూ. 112 కోట్ల డిమాండ్..
మొదట ఈ చిత్రానికి ‘LIC’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే పేరు పెట్టాలని విఘ్నేశ్ శివన్ భావించారు. అయితే, ఈ పేరు వినగానే మనందరికీ తెలిసిన ప్రభుత్వ భీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (LIC) నుండి లీగల్ నోటీసులు వచ్చాయి. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ మాట్లాడుతూ.. “మేము ఆ టైటిల్ వాడాలంటే ఆ సంస్థ ఏకంగా రూ. 112 కోట్లు అడిగింది. నా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నాను” అని సరదాగా చెబుతూనే చేదు నిజాన్ని వెల్లడించారు.
లీగల్ చిక్కుల్లో పడటం ఇష్టం లేక విఘ్నేశ్ తన దగ్గర ఉన్న మరికొన్ని ఆప్షన్లను పరిశీలించారు. LIP, LIT, LIK, LIF వంటి పేర్లను ముందే అనుకున్న ఆయన, చివరకు ‘LIK’ వైపు మొగ్గు చూపారు. ఇందులో ‘Company’ స్పెల్లింగ్‌ను ‘Kompany’గా మార్చారు. ఈ మార్పు కేవలం చట్టపరమైన ఇబ్బందుల కోసమే కాకుండా, సినిమాలోని పాత్రల వైఖరిని ప్రతిబింబించేలా విభిన్నంగా డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు.
Also Read:CBSE 10th Results: 10 విద్యార్థులకు శుభవార్త.. ఫలితాలు వచ్చేశాయ్..
బాక్సాఫీస్ వద్ద సందడి..
చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా బాగానే రాణిస్తోంది. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 39 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ నటన, విభిన్నమైన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా టైటిల్ కోసం రూ. 112 కోట్లు అడిగారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఈ సినిమాపై జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఏది ఏమైనా, ఒక చిన్న అక్షరం మార్పుతో వందల కోట్ల భారాన్ని తప్పించుకుని సినిమాను విజయవంతంగా విడుదల చేయడంలో విఘ్నేశ్ శివన్ తెలివిగా వ్యవహరించారు.
తాజావార్తలు
-
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేశాడా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!