NTV Telugu Site icon

Bapatla: మార్టురులో గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు.. అడ్డుకున్న ఎమ్మెల్యే

Bapatla

Bapatla

బాపట్ల జిల్లా మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. సమాచారం తెలుసుకుని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. సెర్చింగ్ ఆర్డర్స్ లేకుండా, డిప్యూటేషన్ లేకుండా నెల్లూరు మైనింగ్ ఏడీ మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు.

IND vs ENG: విశాఖలో క్రికెట్ సందడి.. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీగా..!

టీడీపీ సానుభూతిపరులకు చెందిన గ్రానైట్ ప్యాక్టరీలపై బలవంతంగా దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు. పోలీసులను, విజిలెన్స్ అధికారులను అడ్డుపెట్టుకుని ప్యాక్టరీల యజమానులతో తప్పులు చేయించి.. తిరిగి ఫ్యాక్టరీల పైనే తనిఖీలు చేసి ఫెనాల్టీలు విధించడమేంటంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహించిన మైనింగ్ అధికారుల వెంట వచ్చిన వాహనాల్లో కారం పొట్లాలను గుర్తించారు. అవి వాహనాల్లో ఎందుకు తీసుకొచ్చారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలలో అధికారుల వెంట ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని టీడీపీ వర్గీయులు ఆరోపించారు.

MPs Suspension: బడ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ రద్దు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ.. ఒక ఏడీ స్థాయి అధికారి నలుగురు రౌడీలను పట్టుకుని నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చారన్నారు. వీళ్లు వ్యాపారస్తులను బెదిరించడం, భయపెట్టడం వారి దగ్గరి నుంచి లంచాలు తీసుకోవడం వీరి పని అన్నారు. రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన రాజ్యమేలుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా.. దాడులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.