NTV Telugu Site icon

Vietnam PM: భారత్లో వియత్నాం ప్రధాని పర్యటన.. కీలక అంశాలపై మోడీతో చర్చ

Vietnam Pm

Vietnam Pm

వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు.. చిన్హే భారత పర్యటనలో ఉంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక చర్చలపై చర్చించనున్నారు. మరోవైపు.. భారతదేశం వియత్నాంను తన యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలక స్తంభంగా.. ఇండో-పసిఫిక్ దృష్టిలో ఒక ముఖ్యమైన భాగస్వామిగా పరిగణిస్తుంది.

Read Also: Paris Olympics 2024: భారత పురుషుల హాకీ జట్టుకు మరో విజయం

వియత్నాం ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్హ్‌తో పాటు పలువురు మంత్రులు, ఉప మంత్రులు.. వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటనలో ఉన్నారు. వియత్నాం ప్రధానమంత్రి పర్యటన ప్రతిపాదిత కార్యక్రమం ప్రకారం.. ఆగష్టు 1న రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో సందర్శిస్తున్న నాయకుడిగా అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత అతను మహాత్మా గాంధీకి నివాళులర్పించడానికి రాజ్‌ఘాట్‌కు వెళ్తారు. ఆ తర్వాత.. ప్రధాని మోడీని కలువనున్నారు. అనంతరం వారిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. తన మూడు రోజుల భారత పర్యటనలో.. ఫామ్ మిన్ చిన్హ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్‌లను కూడా కలుస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్‌ను కూడా కలవనున్నారు.

Read Also: Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. ఏడుగేట్లు ఎత్తివేత..!

భారతదేశం-వియత్నాం మధ్య శతాబ్దాల నాటి చారిత్రక, నాగరికత సంబంధాలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ 2016లో వియత్నాం పర్యటన సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక స్థాయికి ఎదిగింది.

Show comments