Plane Door Open : చాలా మందికి ఫ్లైట్ ఎక్కాలనే కోరిక ఉంటుంది.. మొదటిసారి విమానం ఎక్కితే కలిగే ఆనందమే వేరు.. అది సినిమాలోలా ఉంటుంది.. విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి… దిగాలన్నా.. అదృష్టవంతులు కావాలి. ఇలా…ఏదైనా జరగవచ్చు..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.. ఇప్పుడు జరిగినవి కూడా ఒక విచిత్రమైన సంఘటనే.. ఇంతకుముందు ఇలాంటివి జరగడం మీరు చూసి ఉండరు. రష్యా నుంచి వచ్చిన ఓ చార్టెడ్ ఫ్లైట్ ఆకాశంలో కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే తలుపులు తెరిచింది.. ప్రయాణికులు అరచేతిలో పెట్టుకుని గడిపిన క్షణాలవి. విమానం ఆకాశంలో ఉండగా తలుపు సడన్ గా తలుపు తెరుచుకుంది. ఆ సమయంలో విమానంలోనికి గాలి భారీగా చొరబడింది. విమానంలోని సామాను కూడా గాలి దాటికి లోపలికి ఎగిరిపడింది.
Read Also: Viral : త్రీడీతో బురిడీ కొట్టిస్తున్న మేకప్ ఆర్టిస్ట్
అసలు ఏం జరిగింది..
ఎయిర్‌లైన్ క్యారియర్ ఎయిర్‌ఏరోకు చెందిన ప్రొపెల్లర్ విమానం సైబీరియాలోని మగన్ నుంచి రష్యాలోని పసిఫిక్ తీరంలోని మగడాన్‌కు బయలుదేరింది. విమానం ల్యాండ్ అవుతుండగా, వెనుక తలుపు ఒక్కసారిగా మార్గమధ్యంలో తెరుచుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నారు. విమానం వెనుక తలుపు తెరుచుకోవడంతో ఏం జరిగిందో ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.
Read Also: Rotten Coconut Business: బుర్రుండాలే కానీ.. తేలిగ్గా బిలియనీర్ కావొచ్చు
ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత పైలట్ ఎలాగోలా విమానాన్ని వెనక్కి తీసుకుని మగన్‌లోనే ల్యాండ్ చేశాడు. విమానయాన సంస్థ ఎయిర్‌ఏరో ఎయిర్‌లైన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2800-2900 మీటర్ల ఎత్తులో విమానం డోర్ తెరుచుకుంది. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో కూడా ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. విమానం తలుపు తెరిచి ఉన్నా లేదా కిటికీ తెరిచి ఉంటే, బయటి గాలి లోపలికి రావడం మరియు లోపలి గాలి బయటకు వెళ్లడం వల్ల విమానం బ్యాలెన్స్ కోల్పోతుంది. పైలట్ ఎంత మేనేజ్ చేసినా కొన్నిసార్లు పరిస్థితి మరీ దూరం జరిగితే విమానం కూలిపోయే ప్రమాదం ఉంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.